telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

“కార్తీక దీపం” సీరియల్ పై దర్శకుడి వెదవ కామెంట్స్… !?

Karthika-Deepam

కరోనా వైరస్ నివారణలో భాగంగా దేశ వ్యాప్త లాక్‌డౌన్ కొనసాగుతోంది. ఈ కారణంగా ‘కార్తీక దీపం’ సీరియల్ నిలిపివేసి మరోసారి మొదటి నుంచి ప్రసారం చేస్తున్నారు. రెండోసారి ప్రసారం చేస్తున్న కూడా ఇదే సీరియల్‌కు మంచి టీఆర్పీ వస్తుండడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. మలయాళంలో 2014లో ప్రసారమై సూపర్ హిట్‌గా నిలిచిన ‘కరుతముత్తు’కు రీమేక్‌గా ‘కార్తీకదీపం’ రూపొందుతోంది. ఇందులో దీప అలియాస్ వంటలక్క ఫుల్ ఫేమస్. సినిమా హీరోయిన్లకు ధీటుగా ఆమెకు ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడటం విశేషం. ప్రతీ దినం అలరిస్తూ సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతున్న ఈ సీరియల్‌పై టాలీవుడ్‌ యంగ్ డైరెక్టర్ శైలేష్ కొలను సెటైర్స్ వేశారు. ఏదో సరదా అనుకుంటే సీన్ రివర్స్ అయి తిట్లు పడ్డాయట. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా పేర్కొంటూ ట్వీట్ చేశారు. ”అమ్మ కార్తీక దీపం సీరియల్‌కి పెద్ద ఫ్యాన్. రోజూ టిఫిన్ చేసేటప్పుడు సీరియల్ డిస్కషన్స్ వినీ వినీ లైట్‌గా అర్థం చేసుకున్నా. అప్పటి నుంచి వెదవ కామెంట్లు చేసి కావాలని తిట్లు తింటున్నా” అని పేర్కొంటూ ఇది జస్ట్ ఫన్నీ.. ఎవ్వరినీ ఇబ్బందిపెట్టాలని కాదు అంటూ మహిళా లోకాన్ని స్పెషల్‌గా అట్రాక్ట్ చేశారు డైరెక్టర్ శైలేష్ కొలను. ఇటీవలే ఈ డైరెక్టర్ రూపొందించిన HIT సినిమా విడుదలై తెలుగు ప్రేక్షకులను అలరించింది.

Related posts