telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

నాగ్ బర్త్ డే కామన్ డీపీ రిలీజ్ చేసిన సమంత

Nag

ఆగష్టు 29న రానున్న నాగార్జున బర్త్ డే సందర్భంగా కామన్ డీపీ రిలీజ్ చేసి అక్కినేని ఫ్యాన్స్‌ని హుషారెత్తించింది సమంత. ఈ మేరకు తన ట్విట్టర్ ఖాతాలో నాగార్జున కామన్ డీపీ పోస్ట్ చేసిన సామ్.. ”కింగ్ నాగార్జున బర్త్ డే డీపీ రిలీజ్ చేయడం చాలా గౌరవంగా భావిస్తున్నాను. ఆయనపై నాకు ఎల్లవేళలా ప్రేమ, గౌరవం ఉంటుంది. అందరి గుండెల్లో ఎప్పుడూ ఆయన రాజే” అని పేర్కొంది సమంత. ఆమె విడుదల చేసిన ఈ డీపీలో నాగార్జున సినిమాల్లో అన్ని గెటప్స్ పొందుపరిచి అక్కినేని అభిమానులకు సర్ప్రైజ్ ఇచ్చారు. ప్రస్తుతం ఈ డీపీ వైరల్ గా మారింది. ఇక మరికొద్ది రోజుల్లోనే బుల్లితెరపై… నాగార్జున హోస్ట్‌గా వ్యవహరిస్తున్న బిగ్ బాస్ తెలుగు సీజన్ 4 ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. నాగార్జున పుట్టిన రోజు కానుకగా ఈ ప్రోగ్రాం స్టార్ట్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు.

Related posts