telugu navyamedia
రాజకీయ వార్తలు

లాక్‌డౌన్‌ పై సీఎంలతో మోదీ వీడియో కాన్ఫరెన్స్‌

Modi Mask

దేశంలో లాక్ డౌన్ అమలవుతున్న నేపథ్యంలో అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహిస్తున్నారు. లాక్‌డౌన్‌ ఎత్తివేసే విషయం పై సీఎంల అభిప్రాయాలు తెలుసుకుంటున్నారు. ముఖానికి మాస్కు ధరించి మోదీ ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఒకవేళ లాక్‌డౌన్‌ ఎత్తివేస్తే దేశంలో ఏ విధమైన కొత్త సమస్యలూ రాకుండా చూడాలని మోదీ అన్నారు.

లాక్‌డౌన్ గడువు ఈ నెల 14తో ముగియనున్న నేపథ్యంలో ముఖ్యంగా ఈ విషయంపైనే చర్చిస్తున్నారు. అలాగే, కరోనా నేపథ్యంలో తీసుకుంటున్న చర్యలు, తీసుకోవాల్సిన మరిన్ని అంశాలపై ఆయన మాట్లాడుతున్నారు.లాక్‌డౌన్‌ను పొడిగించాలా? వద్దా అన్న విషయంమై నేడు మోదీ ప్రకటన చేయనున్నారు. సీఎంలతో సమావేశం ముగిసిన అనంతరం లేక ఈ రోజు రాత్రి మోదీ జాతినుద్దేశించి మాట్లాడతారని తెలుస్తోంది.

Related posts