telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

థియేటర్ల మాఫియాతో సమస్య… ఆ కుక్కలకు బుద్ధి చెప్పాల్సిందే : అశోక్ వల్లభనేని

Rajanikanth Petta release images

తెలుగు రాష్ట్రాల్లోని థియేటర్లన్నీ ప్రముఖ నిర్మాతల కనుసైగల్లోనే నడుస్తాయని, వారు చెప్పిన సినిమాలకే థియేటర్లు కేటాయిస్తారనే వివాదం మరోసారి తెరమీదకు వచ్చింది. రజినీకాంత్ హీరోగా నటిస్తున్న “పేట” సినిమాకు తెలుగులో థియేటర్ల సమస్య ఎదురైంది. సంక్రాంతి బరిలో కాగా ఈ సంక్రాంతికి ‘ఎన్టీఆర్ కథానాయకుడు’, ‘వినయ విధేయ రామ’, ‘ఎఫ్ 2’, ‘పేట’లతో పాటు ‘విశ్వాసం’, ‘ది యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్’ వంటి సినిమాలు విడుదలవుతున్న కానున్నాయి. వీటిల్లో కొన్ని సినిమాలకు కనీసం థియేటర్లు కూడా దొరికే పరిస్థితి లేదు. ఈ సందర్భంగా నిర్మాత అశోక్ వల్లభనేని అల్లు అరవింద్, దిల్ రాజు, యువి క్రియేషన్స్ వారిపై మండిపడ్డాడు.

అల్లు అరవింద్, దిల్ రాజు, యువి క్రియేషన్స్ వారు తనకు థియేటర్లు ఇవ్వకుండా ఇబ్బందికి గురి చేస్తున్నారని, “పేట” సినిమాకి థియేటర్లు ఇవ్వడానికి ఈ నిర్మాతలకు నొప్పేంటి..? అని ప్రశ్నించాడు. వందలాది థియేటర్లలో ఒకే సినిమాను వేసి, ఇతర సినిమాలకు థియేటర్లు ఇవ్వకుండా నాటకాలు ఆడుతున్నారని, వాళ్ళు వేసిన సినిమాలనే చూడాలంటూ బలవంతంగా మనపై రుద్దుతున్నారని, ఈ కుక్కలకు బుద్ధి చెప్పాలంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజాభిమానంతో గెలిచి ఎవరో నయీంని చంపారు… మరి థియేటర్ల మాఫియాని ఎందుకు చంపేయరు? అంటూ ఎమోషనల్ స్పీచ్ ఇచ్చారు.

ఇక థియేటర్ల మాఫియా కారణంగా “పేట” సినిమాకు సమస్య ఉందని, సినిమా బాగుంటే ఎవ్వరూ ఆపలేరని, ముగ్గురు, నలుగురు చేస్తున్న సినిమాలకు మాత్రమే అన్ని థియేటర్లనూ కేటాయించుకుంటున్నారని, ఇతరులను బతకనిచ్చే పరిస్థితి లేదని నిర్మాత టి.ప్రసన్నకుమార్ వాపోయారు. ఉన్న అన్ని థియేటర్లలో ఆ రెండు మూడు సినిమాలు మాత్రమే ఆడిస్తుంటే ఎలాగని ప్రశ్నించారు. ఈ మాఫియాను తొలగించేందుకు సీఎంలు కేసీఆర్, చంద్రబాబులతో మాట్లాడతామని, తమ సినిమాలే ఉండాలన్న ధోరణి మంచిది కాదని అన్నారు.

Related posts