వరల్డ్ బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 3 కార్యక్రమం మరో రెండు వారాలలో ముగియనుంది. బిగ్‌బాస్ 3 నుండి గత వారం మహేశ్ విట్టా ఎలిమినేట్ అయ్యాడు. ఇక బిగ్‌బాస్ హౌస్‌లో బాబాభాస్కర్, వరుణ్ సందేశ్, వితిక, రాహుల్, అలీ రెజా, శివ జ్యోతి, శ్రీముఖి ఉన్నారు. అయితే ఈ వారం అందరూ ఎలిమినేషన్ లో ఉండడం విశేషం. మరి వచ్చేవారం ఎవరు ఎలిమినేట్ అవుతారనేది ఆసక్తికరంగా మారింది. గత ఎపిసోడ్లో బిగ్ బాస్ ఇంటి సభ్యులకి బిగ్ బాస్ హోటల్ టాస్క్ ఇచ్చిన సంగతి తెలిసిందే. హౌజ్‌మేట్స్ కుటుంబ సభ్యులు ఇంట్లో సందడి చేయగా, కామెడీ, ఎమోషనల్, డ్రామా తదితర అంశాలు ప్రేక్షకులకి ఫుల్ ఎంటర్‌టైన్‌ని అందించాయి. ఇక నేడు ఇంటి సభ్యులకి బిగ్ బాస్ ఫన్ టాస్క్ ఇవ్వగా, ఇందులో ఒక్కొక్కరు ఒక్కో సినిమా క్యారెక్టర్లో ఇన్వాల్స్ అయి జీవించారు. శ్రీముఖి.. మహానటి చిత్రంలో కీర్తి సురేష్ పాత్ర పోషిస్తే, శివజ్యోతి.. చంద్రముఖిలో జ్యోతికగా అలరించింది. ఇక వరుణ్ సందేశ్, వితికాలు బాహుబలి 2 చిత్రంలోని ఓరోరి రాజ్యం సాంగ్ ఫీట్‌ని అనుకరించే ప్రయత్నం చేశారు. ఈ సాంగ్‌లో ప్రభాస్ వీపుపై నుండి అనుష్క బోట్లోకి ఎక్కుతుంది. ఇదే ప్రయత్నం వితికా చేయగా.. వరుణ్ కెవ్వుమని కేక వేసాడు. తాజాగా విడుదలైన ప్రోమోలో ఆ సన్నివేశాలు చూపించారు. కాగా, ఇంటి సభ్యులు అందరు ఈ వారం నామినేషన్లో ఉండగా ఎవరు ఎలిమినేట్ అవుతారనే దానిపై సస్పెన్స్ నెలకొంది.
Cinemallo manaki nachina characters lo housemates 🎞️📽️#BiggBossTelugu3 Today at 9:30 PM on @StarMaa pic.twitter.com/4ZUWgF9BYv
— STAR MAA (@StarMaa) 18 October 2019