telugu navyamedia
క్రైమ్ వార్తలు వార్తలు సామాజిక

ప్రియురాలుకు బాటిల్‌ రక్తం బహుమానం.. ప్రాణాలు తీసుకున్న ప్రియుడు

blood bottle

ప్రేమ గుడ్డిది. ప్రేమలో పడ్డవారు నిద్రాహారాలు మాని, ప్రేమించిన అమ్మాయి కోసం పడరాని పాట్లుపడుతారు. ప్రాణాలను కూడా లెక్కచేయకుండా ఎంతకైనా తెగిస్తుంటారు కొందరు యువకులు. ప్రేమ కొందరికి ప్రాణాలు పోస్తుంది. ఆ ప్రేమే కొందరి ప్రాణాలు తీస్తుంది. తన ప్రియురాలు తనతో మాట్లాడడం లేదని ఓ ప్రేమికుడు తన మణికట్టును కోసుకుని.. రక్తాన్ని బీర్‌బాటిల్‌లో పట్టి ఆమెకు బహుమానంగా పంపించాడు. ఈ సంఘటన తమిళనాడులోని నంగనల్లూరులో బుధవారం చోటు చేసుకోగా ఆలస్యంగా వెలుగు చూసింది.

నంగనల్లూరుకు చెందిన కుమారీశ పండియన్ గత కొన్ని సంవత్సరాల నుంచి ఓ అమ్మాయిని ప్రేమిస్తున్నాడు. అయితే గత కొద్ది వారాల నుంచి ఆ యువతి.. పండియన్‌తో మాట్లాడడం మానేసింది. సోషల్ మీడియాలో కూడా అతని కాంటాక్ట్‌ను బ్లాక్ చేసింది. దీంతో ఆ ప్రేమికుడు తీవ్ర మనోవేదనకు గురయ్యాడు. తీవ్ర ఒత్తిడికి లోనైన పండియన్.. మంగళవారం తన స్నేహితుడైన ముత్తును కలుసుకుని మద్యం సేవిస్తూ విషయం చెప్పాడు.

మద్యం మత్తులో ఉన్న పండియన్.. బీర్ బాటిల్‌ను పగులగొట్టి తన మణికట్టును కోసుకున్నాడు. ఆ తర్వాత రక్తాన్ని మరో బీర్ బాటిల్‌లో పట్టాడు. ఈ రక్తాన్ని తన ప్రియురాలికి బహుమానంగా ఇవ్వాలని ముత్తును పండియన్ కోరాడు. ఇక తీవ్ర రక్తస్రావమైన పండియన్‌ను ముత్తు ఆస్పత్రికి తరలించాడు. బుధవారం తెల్లవారుజామున ఆస్పత్రిలో చికిత్స పొందుతూ పండియన్ కన్నుమూశాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Related posts