telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

అమితాబ్ చిరుతో స్నేహం కోసమే చేశారు : రామ్ చరణ్

Ram-Charan

సురేందర్ రెడ్డి దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి నటిస్తోన్న 151వ చిత్రం “సైరా నరసింహా రెడ్డి”. కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రామ్‌చరణ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రస్తుతం సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో భారీగా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. బ్రిటీష్ వారిని ఎదిరించిన తొలి స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితగాథను ఆధారంగా చేసుకుని ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తోన్న సంగతి తెలిసిందే. అమితాబ్ బచ్చన్, నయనతార, విజయ్ సేతుపతి, కిచ్చా సుదీప్, జగపతిబాబు, రవికిషన్, తమన్నా, నిహారిక తదితరులు కీలక పాత్రల్లో నటించారు. అమిత్ త్రివేది సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి రత్నవేలు సినిమాటోగ్రఫీ అందించారు. ఈ సినిమా టీజర్‌ను చిరంజీవి పుట్టినరోజు (ఆగస్ట్ 22) సందర్భంగా రెండు రోజుల ముందుగానే ఆగస్ట్ 20న విడుదల చేశారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా “సైరా” టీజర్ ట్రెండ్ అవుతుంది. ఇప్పటికే 10 మిలియన్ల డిజిటల్ వ్యూస్ అధిగమించేసింది.సైరా సినిమాలో అమితాబ్ బచ్చన్ చిరంజీవికి గురువుగా నటిస్తున్న విషయం తెలిసిందే. చిరు స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డిగా నటిస్తుండగా, అతని గురువుగా బిగ్‌బీ అమితాబ్ నటిస్తున్నారు. ఈ సందర్భంగా నిర్మాత రామ్‌చరణ్ ప్రముఖ ఇంగ్లీష్ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. “నాన్న గారు ఫోన్‌చేసి మా సినిమాలో మీరు నటించాలని అమితాబ్ గారిని కోరగా, అతను వెంటనే ఓకే చేయడం మా అదృష్టమని, ఆయన హిందీయేతర సినిమాలో నటించడం ఇదే మొదటిసారి అయ్యుంటదని చరణ్ అన్నారు. కాగా అమితాబ్‌గారు కనీసం ప్రయాణ ఖర్చులు కూడా మా దగ్గర తీసుకోలేదని, కథ నచ్చి, చిరుతో స్నేహం కోసం ఈ సినిమా చేస్తున్నానని ఆయన అన్నారన్నారు.

Related posts