మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ 19వ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఏఏ19గా తెరకెక్కుతున్న ఈ చిత్ర టైటిల్ను ఆగస్ట్ 15న స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా “అల.. వైకుంఠపురములో” అంటూ ప్రకటించింది చిత్రబృందం. హారికా హాసినీ, గీతా ఆర్ట్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో పూజా హెగ్డే కథానాయికగా నటిస్తోంది. ఎస్ఎస్ థమన్ సంగీతం అందిస్తున్నాడు. వచ్చే సంక్రాంతికి ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఫ్యామిలీ ఓరియెంటెడ్ మూవీగా రూపొందుతున్న ఈ చిత్రంలో సుశాంత్, నివేదా పేతురాజ్ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. అయితే తాజాగా బన్నీ తన కుమార్తె అల్లు అర్హతో ఆడుకుంటున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. బన్నీ తన కుమార్తె తో ‘ఫసక్’ డైలాగ్ చెప్పించాడు. ఓన్లీ వన్స్.. ఫసక్ అంటూ అర్హ ముద్దు ముద్దుగా చెబుతున్న మాటలు ఆకట్టుకుంటున్నాయి. ఫసక్ అంటూ అర్హ దువ్వెనతో బన్నీ గొంతు కోస్తున్నట్లు నటించి తండ్రితో సరదాగా ఆడుకుంటోంది.
Cuteness Overloaded 😍😍😍@alluarjun playing with #AlluArha ❤ pic.twitter.com/hZ24Ykpwae
— Allu Arjun FC (@AlluArjunHCF) August 19, 2019



బిగ్ బాస్ సీజన్ 5లో బిగ్ మిస్టేక్ ఇదేనా?