తెలుగులో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన సొట్టబుగ్గల సుందరి తాప్సీ ఆ తరువాత బాలీవుడ్ లో అవకాశాలను చేజిక్కించుకుని స్టార్ హీరోయిన్ గా దూసుకెళ్తోంది. అయితే ఈ మిల్కీ బ్యూటీకి కెరీర్ ప్రారంభంలో సక్సెస్ అంత ఈజీగా దొరకలేదు. చాలా కష్టనష్టాలను చవిచూడాల్సి వచ్చింది తాప్సీ. ప్రస్తుతం టాలీవుడ్, బాలీవుడ్లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ అయ్యింది తాప్సీ. ఈ ఢిల్లీ అమ్మడు కెరీర్లో ఎదిగే క్రమంలో ఎదురైన ఇబ్బందులు గురించి కొన్ని ఆసక్తికర విషయాలను వెల్లడించింది. “ప్రజలు టికెట్ కొనుక్కుని మమ్మల్ని చూడటానికి వస్తారు. కానీ… వారితో మేం ఉండటానికి ఇష్టపడరు. నేను నటిగా రాణించాలనుకున్న తరుణంలో ముంబైకి వెళ్లాను. అక్కడ ఇల్లు దొరకడానికి నాకు నెల సమయం పట్టింది. నేను సినిమాల్లో రాణించాలనుకుంటున్నానని తెలియగానే చాలా మంది అద్దెకు ఇల్లు కూడా ఇవ్వలేదు. అయితే హైదరాబాద్ ఇంటి విషయంలో నాకు పెద్దగా సమస్య ఎదురు కాలేదు. ఢిల్లీ, హైదరాబాద్ ప్రాంతాలు ఆలోచనా విధానంలో ఒకేలా ఉంటాయి. నేను, నా చెల్లెలితో కలిసి ఓ అపార్ట్మెంట్లో ఉంటున్నాను. మా తల్లిదండ్రులు ఢిల్లీలో ఉంటారు” అని తెలియజేసింది తాప్సీ.
previous post
next post
నీరే జీవనానికి ఆధారం… కాళేశ్వరం ప్రాజెక్టు ఓ అద్భుతం: నాగార్జున