telugu navyamedia
సినిమా వార్తలు

“మిస్ ఇండియా”గా కీర్తి సురేష్… టీజర్ విడుదల

Miss-India

మహానటి సావిత్రి జీవితం ఆధారంగా తెలుగులో రూపొందిన “మహానటి” చిత్రంలో నటించి తెలుగు ప్రేక్షకులను హృదయాలను కొల్లగొట్టింది కీర్తి సురేష్. అంతేకాదు ఈ సినిమాలో తన నటనకుగానూ నేషనల్ అవార్డు సైతం అందుకుంది. మరో డిఫరెంట్ సినిమాతో తెలుగు ఆడియెన్స్ ముందుకు రాబోతోంది. మహానటి తరువాత కీర్తి నటిస్తున్న డైరెక్ట్ సోలో తెలుగు సినిమా “మిస్ ఇండియా”. త్వరలో ప్రేక్షకుల ముందుకు రానున్న “మిస్ ఇండియా” సినిమాను ఈస్ట్ కోస్ట్ ప్రొడక్షన్స్ పై మహేష్ కోనేరు నిర్మిస్తున్నారు. ఇక నరేంద్ర నాథ్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాకు థమన్ సంగీతం అందిస్తున్నాడు. సినిమా టీజర్ ని తాజాగా చిత్ర యూనిట్ విడుదల చేసింది. సినిమాలో కీర్తి సరికొత్తగా, గ్లామర్ డోస్ ఎక్కువ కాకుండా ఫుల్ స్టైలిష్ గా కనిపిస్తున్న కీర్తి పాత్ర సినిమాలో చాలా డిఫరెంట్ గా ఉండనుందట. ఇక టీజర్ లో విజువల్స్ లొకేషన్స్ అందంగా కనిపిస్తున్నాయి. థమన్ ఇచ్చిన నేపథ్య సంగీతం కూడా ఆకట్టుకుంటోంది. మీరు కూడా ఈ టీజర్ ను వీక్షించండి.

Related posts