సాధారణంగా సెలబ్రిటీలు, స్టార్ హీరోలు, హీరోయిన్లు ఎకానమీ జోలికి అసలు వెళ్లరు. ఎక్కువగా బిజినెస్ క్లాస్ లో ప్రయాణించడానికే ఆసక్తి చూపుతుంటారు. అభిమానుల్లో వారికుండే క్రేజ్ కారణంగా ఎకానమీ క్లాస్ లో ప్రయాణిస్తే ఇబ్బందులు తలెత్తుతాయని భావిస్తారు. అయితే బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ మాత్రం సాధారణ ప్రయాణికుడిగా ఎకానమీ క్లాస్ లో కనిపించేసరికి ప్రయాణికులంతా ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఆయన మాత్రం సింపుల్ గా నవ్వుతూ విండో సీట్ లో కూర్చున్నారు. ఈ క్రమంలో కొందరు అభిమానులు తీసిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇది చూసిన అమీర్ అభిమానులు రియల్ హీరో అంటూ ఆయన సింప్లిసిటీని పొగుడుతూ ప్రశంసిస్తున్నారు. ప్రస్తుతం ఈ హీరో “లాల్ సింగ్ చద్దా” అనే సినిమాలో నటిస్తున్నారు.
previous post
next post