telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ

చంద్రబాబు పై హీరో మంచు విష్ణు ఫైర్

Manchu-Vishnu
టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుపై హీరో మంచు విష్ణు మండిపడ్డారు. చంద్రగిరి నియోజకవర్గంలో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి మద్దతుగా విష్ణు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చంద్రగిరి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశానని చెప్పుకుంటున్న చంద్రబాబు తన కొడుకు  ఇక్కడ నుంచి ఎందుకు ఎన్నికల బరిలోకి దించలేదో చెప్పాలని డిమాండ్ చేశారు. 
లోకేష్ ను మంగళగిరి నుంచి ఎందుకు బరిలోకి దింపారోనని నిలదీశారు. మీరన్నట్లు చంద్రగిరిని అభివృద్ధి చేస్తే లోకేష్ ను ఇక్కడే పోటీకి నిలబెట్టేవారని దుయ్యబాట్టారు. నెలకు 10 రోజులు ఇక్కడ ఉండే తమను చంద్రబాబు వలస పక్షులు అంటున్నారని ద్వజమెత్తారు.  సంవత్సరానికి ఒక రోజే నారావారిపల్లెకు వచ్చే చంద్రబాబును ఏమనాలని ప్రశ్నించారు.

Related posts