telugu navyamedia
రాజకీయ వార్తలు

బ్రాండెడ్, పేటెంటెడ్ ఔషధాల దిగుమతులపై 100% సుంకం ప్రకటించిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి సంచలన నిర్ణయం ప్రకటించారు.

అక్టోబర్ 1, 2025 నుంచి బ్రాండెడ్, పేటెంటెడ్ ఔషధాల దిగుమతులపై 100% సుంకం (టారిఫ్‌) విధించబోతున్నట్టు గురువారం ప్రకటించారు.

ఈ నిర్ణయం ప్రపంచవ్యాప్తంగా ఔషధ రంగాన్ని ప్రభావితం చేయనుండగా, భారతదేశానికి ఇది పెద్ద ఎదురుదెబ్బ అవుతుంది. ఎందుకంటే, అమెరికా మన దేశ ఔషధ ఉత్పత్తులకు ప్రధాన మార్కెట్‌గా ఉంది.

టారిఫ్‌లు పెరగడం వల్ల భారత ఔషధ కంపెనీలు దిగుమతులు తగ్గించుకోవాల్సి వస్తుంది. దీని వల్ల భారత కంపెనీలకు భారీగా నష్టం వస్తుంది. మరోవైపు అమెరికా ప్రజలకు ఖర్చులు కూడా పెరుగుతాయి.

ట్రంప్ ప్రకటించిన ఈ టారిఫ్ విధానం ఎందుకు తీసుకున్నారో స్పష్టంగా తెలియకపోయినా, మళ్లీ వాణిజ్య యుద్ధం వచ్చే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.

ట్రంప్ ట్రూత్ సోషల్‌లో పోస్ట్ చేసిన ప్రకారం అక్టోబర్ 1, 2025 నుంచి, బ్రాండెడ్ లేదా పేటెంటెడ్ ఔషధ ఉత్పత్తులపై 100% టారిఫ్ విధిస్తామన్నారు.

కానీ, కంపెనీ అమెరికాలో తమ ఔషధ ఫ్యాక్టరీ ఉంటే, ఆ టారిఫ్ మినహాయించబడుతుంది.

ఈ టారిఫ్ విషయంలో ట్రంప్ ఇంకా కిచెన్ క్యాబినెట్లు, బాత్‌రూమ్ వానిటీలపై 50% డ్యూటీ, అప్‌హోల్‌స్టర్డ్ ఫర్నిచర్‌పై 30%, హెవీ ట్రక్కులపై 25% టారిఫ్‌లు ప్రకటించారు.

ఇవన్నీ అక్టోబర్ 1 నుంచి అమలులోకి వస్తాయి. ట్రంప్ ఈ నిర్ణయాలతో అమెరికాలో ఉద్యోగాలు పెంచాలని, ఉత్పత్తి అక్కడే జరగాలని లక్ష్యంగా పెట్టుకున్నారని నిపుణులు చెబుతున్నారు.

Related posts