telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

కాళేశ్వరం కుంభకోణానికి కేసీఆర్ బాధ్యతవహించాలి: టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఫైర్

బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌పై  టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్షాకింగ్ కామెంట్స్ చేశారు. కేసీఆర్ దోషి అని జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ చెప్పిందని తెలిపారు.

కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో లక్షల కోట్ల రూపాయలు వృథా చేసి తెలంగాణను కేసీఆర్ అప్పులపాలు చేశారని జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ తేల్చి చెప్పిందని అన్నారు.

ఇంజనీర్లు చెప్పింది కేసీఆర్ వినకుండా తన సొంత లాభం మాత్రమే చూసుకున్నారని విమర్శించారు. ఇవాళ(శనివారం) ఆందోలు మండలం సంగుపేటలోని ఓ ఫంక్షన్ హాల్‌లో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశం నిర్వహించారు.

ఈ సమావేశంలో కాంగ్రెస్ తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, మంత్రి దామోదర రాజనర్సింహ, పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి, జహీరాబాద్ ఎంపీ సురేష్ షెట్కార్, తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడారు.

తనకి ఇష్టం ఉన్న చోట కాళేశ్వరం ప్రాజెక్టు కట్టాలని కేసీఆర్ ఆదేశాలు ఇచ్చారని చెప్పుకొచ్చారు. రెండే పిల్లర్లు కుంగాయని బీఆర్ఎస్ నేతలు అంటున్నారని…ఇది సామాన్య విషయమా..? అని ప్రశ్నించారు.

ఫార్ములా ఈ కారు రేస్‌లో మాజీ మంత్రి కేటీఆర్ అవినీతికి పాల్పడలేదా..? అని నిలదీశారు. ప్రభుత్వ సొమ్ము తిన్న వాళ్లు కక్కక తప్పదని మహేష్ కుమార్ గౌడ్ హెచ్చరించారు.

Related posts