telugu navyamedia
క్రీడలు ట్రెండింగ్ వార్తలు

ఇది నా లాస్ట్ మ్యాచ్ కాదు : ధోని

ఈ ఏడాది ఐపీఎల్ తుది దశకు చేరుకుంది. టైటిల్ రేసు నుంచి ముందే తప్పుకున్న చెన్నై సూపర్ కింగ్స్ తమ ఆఖరి మ్యాచ్ కూడా ఆడేస్తుంది. అయితే అనూహ్య నిర్ణయాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచే ఆ జట్టు సారథి మహేంద్ర సింగ్ ధోనీ వచ్చే సీజన్ ఆడటంపై క్లారిటీ ఇచ్చాడు. “మ్యాచ్ కామెంటేటర్‌‌గా ఉన్న డ్యానీ మారిసన్.. ‘ధోనీ.. చెన్నై సూపర్ కింగ్స్‌కి ఇదే మీ చివరి మ్యాచ్..?’ అని పరోక్షంగా రిటైర్మెంట్ గురించి ప్రశ్నించాడు. దాంతో ధోనీ ‘కచ్చితంగా కాదు’ అని నవ్వుతూ సమాధానమిచ్చాడు. దాంతో ఐపీఎల్‌లో ధోనీ రిటైర్మెంట్‌పై పూర్తి క్లారిటీ వచ్చినట్లయింది.” అయితే ఐపీఎల్ 2020 సీజన్‌లో 14 మ్యాచ్‌లాడిన చెన్నై సూపర్ కింగ్స్ కేవలం 6 మాత్రమే గెలిచింది. పాయింట్ల పట్టికలోనూ చిట్టచివరి స్థానంలో నిలిచింది. అంతర్జాతీయ క్రికెట్‌కు బైబై చెప్పిన ధోనీ.. ఐపీఎల్‌కి కూడా ఈ ఏడాదే రిటైర్మెంట్ ప్రకటించేస్తాడని అందరూ ఊహించారు. చెన్నై ఓటములకు ధోనీ పేలవ నిర్ణయాలే కారణమని ఎండగట్టిన అభిమానులు.. వచ్చే ఏడాది సీనియర్లందరినీ తప్పించి కొత్త కెప్టెన్‌తో బరిలోకి దిగాలని చెన్నై ఫ్రాంఛైజీకి సోషల్ మీడియాలో సూచనలు చేశారు. మరోవైపు ధోనీ కూడా రెండు వారాల నుంచి ఆడిన ప్రతి మ్యాచ్‌లోనూ ప్రత్యర్థి టీమ్ ఆటగాళ్లకి గుర్తుగా తన జెర్సీని బహూకరిస్తూ కనిపించాడు. దాంతో అతని రిటైర్మెంట్ ఖాయమని వార్తలు వచ్చాయి. దీనిపై ధోని నేడు పూర్తిగా క్లారిటీ ఇచ్చేశాడు. అయితే కేహీ ఏడాది ఐపీఎల్ లో ధోని ఎంత స్ట్రాంగ్ గ వస్తాడు అనేదానికోసం వేచిచూడాలి.

Related posts