telugu navyamedia
CBN ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

చేనేత కార్మికులకు శుభవార్త చెప్పిన ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం.

నేటి నుంచే ఉచిత విద్యుత్ అమలుకు సీఎం చంద్రబాబు అనుమతించారు.

మగ్గాలకు 200 యూనిట్లు, మరమగ్గాలకు 500 యూనిట్ల ఉచిత విద్యుత్.

నేతన్నల ఉచిత విద్యుత్‌కు రూ.125 కోట్లు ఖర్చు చేయనున్న ప్రభుత్వం – 50 వేల మగ్గాలు, 15 వేల మరమగ్గాలు కలిగిన కుటుంబాలకు లబ్ధి పొందనున్నారు.

జాతీయ చేనేత దినోత్సవానికి వారం ముందే పథకం అమలుకు సీఎం అనుమతించారు.

నేతన్నలకు ఉచిత విద్యుత్ అమలుపై సీఎంకు మంత్రి సవిత ధన్యవాదాలు తెలిపారు.

Related posts