telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

ఫిరాయింపు ఎమ్మెల్యేలపై తీర్పు స్వాగతార్హం: కాంగ్రెస్ పాదయాత్రపై బీజేపీ అధ్యక్షుడు రామచందర్ రావు సంచలన వ్యాఖ్యలు

పార్టీ మారిన ఎమ్మెల్యేలపై సుప్రీంకోర్టు తీర్పుపై తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రామచందర్ రావు స్పందించారు.

ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై స్పీకర్ మూడు నెలల్లోగా నిర్ణయం తీసుకోవాలన్న తీర్పును స్వాగతిస్తున్నామని, ఇది ఒక మంచి పరిణామమని ఆయన అన్నారు.

గతంలో బీఆర్ఎస్, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలు ఫిరాయింపులను ప్రోత్సహించాయని ఆరోపించారు.

కాంగ్రెస్ పార్టీ చేపట్టనున్న జనహిత పాదయాత్రపై కూడా రామచందర్ రావు స్పందించారు. ఆ పార్టీ జనహిత పాదయాత్ర చేస్తుందో లేక జనాన్ని మోసం చేసే యాత్ర చేస్తుందో చెప్పాలని ప్రశ్నించారు.

ఆరు గ్యారెంటీలు, డిక్లరేషన్లు, కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలలో ఎన్ని నెరవేర్చారో శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. శ్వేతపత్రం విడుదల చేస్తేనే పాదయాత్ర చేసే నైతిక హక్కు ఉంటుందని ఆయన అన్నారు.

Related posts