భారీ వర్షాల దృష్ట్యా మాజీ ముఖ్యమంత్రి, వైయస్సార్సీపీ అధ్యక్షుడు శ్రీ వైయస్.జగన్మోహన్రెడ్డి రేపటి ప్రకాశం జిల్లా పర్యటన వాయిదా పడింది. వాతావరణం అనుకూలించిన తర్వాత శ్రీ జగన్ ప్రకాశం జిల్లా పర్యటన విషయమై తదుపరి ప్రకటన చేస్తామని వైయస్సార్సీపీ కేంద్ర కార్యాలయం వెల్లడించింది.

