telugu navyamedia
క్రీడలు వార్తలు

ఇంగ్లాండ్ టూర్ కు టీమిండియా టెస్ట్ కెప్టెన్ గా శుభ్‌మన్ గిల్‌: బీసీసీఐ

ఇంగ్లాండ్ టూర్కు టీమ్‌ ని బీసీసీఐ ప్రకటించింది. సెలక్షన్ కమిటీ జట్టు పగ్గాలను 25 ఏళ్ల యువ ఆటగాడు శుభ్‌మన్ గిల్‌ కు అప్పగించింది.

టెస్టుల్లో భారత్‌ కు గిల్ నాయకత్వం వహించడం ఇదే తొలిసారి. ఈ కీలక సిరీస్‌ కు వికెట్ కీపర్-బ్యాటర్ రిషభ్ పంత్‌ ను  వైస్ కెప్టెన్‌ గా నియమించారు.

జైశ్వాల్, కేఎల్ రాహుల్, సాయి సుదర్శన్, అభిమన్యు ఈశ్వరన్, కరుణ్ నాయర్, నితీష్ రెడ్డి, జడేజా, ధృవ్ జురెల్, సుందర్, శార్దూల్ థాకూర్, బూమ్రా, సిరాజ్, ప్రసిద్ధ కృష్ణ, ఆకాష్ దీప్, అర్ష్ దీప్, కుల్దీప్ యాదవ్‌ ను బీసీసీఐ సెలెక్ట్ చేసింది.

Related posts