*రేవంత్ రెడ్డిది రచ్చబండ కాదు..లుచ్చా బండ ..బట్టేబాజ్ బండ
*రేవంత్‌రెడ్డి ఓ బ్లాక్‌మెయిలర్ ..
*సీఎం కేసీఆర్ దేశ్ కా నేత..
*కేసీఆర్ కేటీఆర్‌పై ప్రజలకు నమ్మకం ఉంది..
*కాంగ్రెస్ హయాంలో భూమి నుంచి ఆకాశం దాకా స్కాములే..
*రేవంత్‌రెడ్డి ఓ బ్లాక్‌మెయిలర్…
*నేను ఏ భూములు కొన్నా చట్టబద్ధంగా కొన్నా
*మార్కెట్ రేటు కంటే ఎక్కువ డబ్బులు ఇచ్చా.
*భూమి కొనద్దా..భూమి కొంటే తప్పా..
టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి పై మంత్రి మల్లారెడ్డి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ…రేవంత్ ఏ పార్టీలో చేరితే ఆ పార్టీ మటాష్ అని, పైసలు పెట్టి కాంగ్రెస్ పార్టీలో చేరిన వ్యక్తి రేవంత్ అని ఆరోపించారు.
రేవంత్‌రెడ్డి ఓ దొంగ రెడ్డి ,దుర్మార్గుడని.. బట్టేబాజ్ అంటూ మంత్రి పరుష పదజాలం ఉపయోగించారు. రేవంత్ రెడ్డిది రచ్చబండ కాదని.. లుచ్చాబండ అంటూ దుయ్యబట్టారు. .మంత్రి కేటీఆర్ పెట్టుబడుల కోసం దావోస్ వెళితే రాహుల్ గాంధీ నైట్ క్లబ్‌లోకి వెళ్తున్నారని ఎద్దేవా చేశారు.
రేవంత్ రెడ్డికి బ్లాక్ మెయిల్ చేయడం అలవాటుగా మారిందని విరుచుకుపడ్డారు. తెదేపాలో ఉన్ననాటి నుంచి రేవంత్‌రెడ్డి బెదిరింపులకు గురిచేస్తూ.. డబ్బులు వసూలు చేశాడని ఆరోపించారు.
మల్కాజ్ గిరి ఎంపీ సీటు కోసం ఇద్దరికీ పోటీ ఉండేది. సీటు జోలికొస్తే కాలేజీలు మూయిస్తానని బెదిరించిండు. నా కాలేజీలు మూసివేయిస్తానని బెదిరించాడు. చంద్రబాబు కు వాస్తవాలన్నీ చెప్పి సీటు తెచ్చుకుని..గెలిచా అని మంత్రి మల్లారెడ్డి చెప్పుకొచ్చారు. తన విద్యా సంస్థలపై ఎన్నో ఆరోపణలు చేశారని, ఒక్కటీ నిరూపించలేకపోయారని పేర్కొన్నారు.
రేవంత్ బిడ్డ పెళ్లికి తానే డబ్బులు ఇచ్చానని… యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామి సాక్షిగా తాను డబ్బులు ఇవ్వలేదని రేవంత్ ప్రమాణం చేస్తారా అంటూ నిలదీశారు.
తాను పాలు పోసి కష్ట పడి సంపాదించానని..నేను ఏ భూములు కొన్నా చట్టబద్ధంగా కొన్నా…మార్కెట్ రేటు కంటే ఎక్కువ డబ్బులు ఇచ్చా కొన్నాను అంటూ వెల్లడించారు. కానీ రేవంత్ ఏం చేసి ఇన్ని ఆస్తులు ఎలా సంపాదించారో చెప్పాలని సూటిగా ప్రశ్నించారు. లీగల్‌గా వెళ్లి రేవంత్‌ను జైలుకు పంపిస్తానని మంత్రి హెచ్చరించారు
రేవంత్‌రెడ్డి ఓ బ్లాక్‌మెయిలర్ అని .. చివరకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ ను కూడా బ్లాక్మెయిల్ చేస్తారన్నారు. రేవంత్‌రెడ్డి దుర్మార్గుడని.. బట్టేబాజ్ అంటూ మంత్రి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. రేవంత్‌ది రచ్చబండ కాదని.. లుచ్చాబండ అంటూ దుయ్యబట్టారు.
సీఎం కేసీఆర్ 14 యేండ్లు తెలంగాణ సాధన కోసం పోరాడారు, అన్ని వర్గాలు సంతోషంగా ఉన్నాయంటే ఆయన పాలనే కారణం అన్నారు. దమ్ముంటే కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో డిక్లరేషన్ అమలు చేసి చూపించాలని డిమాండ్ చేశారు.
సీఎం కేసీఆర్‌పై రేవంత్ లాంటి వ్యక్తి విమర్శలు చేయడం సిగ్గుచేటు అన్నారు. సీఎం కేసీఆర్ పాలనతో రాష్ట్రం సుభిక్షంగా ఉందని, టీఆర్ఎస్ అధినేత దేశ్ కా నేత అని మల్లా రెడ్డి ప్రశంసలు కురిపించారు. ‘కేసీఆర్ పంజాబ్ లో చెక్కులు పంచడం కాదు.. దేశమంతా చెక్కులు పంచుతాడు. కేసీఆర్ దేశాన్ని పాలించడం ఖాయం, తెలంగాణలో ఇస్తున్న పథకాలు దేశమంతా ఇస్తారు.