వరంగల్ ఎంజీఎం హాస్పిటల్ లో జరిగిన ఘటన దురదృష్టకరమని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. శుక్రవారం ఆయన ఎంజీఎంలో ఎలుకలు దాడి చేసిన వార్డును పరిశీలించి, ఆ పేషంట్ ను పరామర్శించారు. ఎలుకలు కొరికిన రోగి బంధువులతో మాట్లాడిన మంత్రి ఘటనకు దారి తీసిన పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు.
అనంతరం ఎంజీఎం హాస్పిటల్ లోని పరిసరాలను, ఆర్ఐసీయూ ను పరిశీలించిన అనంతరం మీడియాతో మాట్లాడారు. ఎలుకలు కొరుక్కుతినడం మా నిర్లక్షమే..మేము కాదనడం లేదు పూర్తిగా ఎంక్వైరీ చేసి బాధ్యులపై యాక్షన్ తీసుకుంటాం అన్నారు.
గవర్నమెంట్ ఆసుపత్రులలో సహజంగానే పేషెంట్ల విషయంలో జాగ్రత్త చర్యలు తీసుకుంటారని పేర్కొన్న ఆయన, కావాలని పేషెంట్లు పట్ల నిర్లక్ష్యం చెయ్యరని వెల్లడించారు.
హాస్పిటల్ ఘటనకు బాధ్యులపై రిపోర్ట్ మేరకు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు యాక్షన్ తీసుకున్నారు. వెంటనే విచారణ జరిపి, బాధ్యులుగా భావిస్తున్న సూపరిండెంట్ ను బదిలీ చేశారని, ఇద్దరు డాక్టర్లను సస్పెండ్ చేశారని వెల్లడించారు.
ఇక పారిశుధ్య ఏజెన్సీల పైన కూడా చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్న మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఇలాంటి ఘటనలు మళ్లీ పునరావృతం కాకుండా తగిన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.
ఇకపై గట్టి నిఘా ఏర్పాటు చేస్తామని మంత్రి తెలిపారు. అత్యంత జాగ్రత్తగా, పేషంట్లకు సేవలు అందించే కేంద్రంగా పని చేయాలని, వైద్యులు, సిబ్బంది నిర్లక్ష్యాన్ని సహించేది లేదని కొత్త సూపరింటెండెంట్ ని ఆదేశించినట్టు మంత్రి తెలిపారు. ప్రజలు ధైర్యంగా, నమ్మకంగా ఎంజీఎం కు రావచ్చు అని తెలిపారు.
సిఎం కెసిఆర్ ఆశీస్సులతో హైదరాబాద్ తర్వాత వరంగల్ కొత్త మెడికల్ హాస్పిటల్ వస్తోంది…దాన్ని ఏడాదిలోనే కంప్లీట్ చేయాలని టార్గెట్ పెట్టుకున్నామని మంత్రి ఎర్రబెల్లి అన్నారు.
కుటుంబసభ్యుల అంగీకారం మేరకు పేషంట్ శ్రీనివాస్ ని హైదరాబాద్ తరలించాం. కరోనా సమయంలో ఎంజీఎంలో గొప్ప సేవలు అందించారు….డాక్టర్ లు బాగా కష్టపడ్డారన్నారు ఎర్రబెల్లి.