telugu navyamedia
తెలంగాణ వార్తలు

కాంగ్రెస్ అధిష్ఠానం నుంచి వీహెచ్‌కు పిలుపు..

కాంగ్రెస్ సీనియర్ నేత వీ హన్మంతరావుకు ఢిల్లీ నుంచి పిలుపు వచ్చింది. ఇటీవల ఢిల్లీలో జరిగిన సమావేశానికి వీహెచ్‌కు ఆహ్వానం అందలేదు. దీనిపై వీహెచ్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.

తనకు సమాచారం ఇవ్వకుండా రాష్ర్ట ఇంచార్జి మాణిక్కం ఠాగూర్ అవమానించారని వీహెచ్ గుర్ర‌గా ఉన్నారు.దీనిపై ఏఐసీసీకి వి.హనుమంతరావు లేఖ రాశారు.

దీనిపై స్పందించిన ఏఐసీసీ కార్యాలయం ఢిల్లీ వచ్చి కలవాల్సిందిగా వీహెచ్‌కు సమాధానం ఇచ్చింది. దీంతో ఈ రోజు సాయంత్రం సోనియా గాంధీ, రాహుల్ గాంధీలను వీహెచ్ ప్రత్యేకంగా కలవనున్నారు.

Related posts