నీ సౌందర్యం
మానవమాత్రులది కాదే!
నీది ఏ దేవలోకమో?
వివరములు తెలుపవా?
నీ సాంగత్యం మించిన
సౌఖ్యమెక్కడుంది?
నీనోటపలుకులు
నా మదిపై తొలకరి చినుకులు
నీ విరహం
నాలో అహరహం
వాడిగా ఎక్కడో
పొడుస్తూనేవుంది
మనసు దొలుస్తూనేవుంది
ఆ కౌగిలింతలోని
నులివెచ్చదనం…
అప్సరస కౌగిలిలోనైనా
నేను అనుభూతించగలనా???
నీ సాంగత్యం ఓ తీయని కల
నీ స్నేహం ఓ అద్భుత అనుభూతి
నీ ఎడబాటు…
నా ఆశల తడబాటు…
గుండెకు లయతో ఎడబాటు…!
-అవేరా