మేషరాశి..
పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. అల్పభోజనం వల్ల అనారోగ్యాన్ని పొందుతారు. ఏదో ఒక విషయం మిమ్మల్ని మనస్తాపానికి గురిచేస్తుంది. సంఘంలో ఆదరణ లభిస్తుంది. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. ఆలోచనలు అమలు చేస్తారు. దైవదర్శనాలు చేస్తారు. ఆర్థిక ఫలితాలు అనుకూలంగా ఉంటాయి.
వృషభరాశి..
కుటుంబంలో అనుకోకుండా లాభం ఏర్పడే అవకాశం ఉంటుంది. ముఖ్య వ్యవహారాలు నత్తనడకన సాగుతాయి. ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతాయి. ఆరోగ్యం అనుకూలించదు. దూరప్రయాణాలు చేస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో చికాకులు. కొన్ని అంశాలు ఇబ్బంది పెడతాయి.
మిథునరాశి..
ఆర్థిక పరిస్థితి గందరగోళంగా ఉంటుంది. పిల్లలపట్ల ఎక్కువ పట్టుదలతో ఉండటం అంత మంచిదికాదు. ధన నష్టం అవుతుంది. ఆకస్మిక ప్రయాణాలు చేస్తారు. ఆలయ దర్శనాలు చేస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో సమస్యలు ఏర్పడతాయి.కుటుంబ వాతావరణం అంత అనుకూలంగా ఉండకపోవచ్చు. కొన్ని సంఘటనలు కాస్త మనస్తాపాన్ని కలిగిస్తాయి.
కర్కాటకరాశి..
ఆకస్మిక ధననష్టం పట్ల జాగ్రత్తగా ఉండటం మంచిది. సన్నిహితులతో సఖ్యత ఏర్పడుతుంది. విందువినోదాలులో పాల్గొంటారు. బంధువులను కలుసుకుంటారు. చేపట్టిన పనులను ప్రణాళికా బద్దంగా పూర్తిచేస్తారు. అవసరానికి సహాయం చేసేవారున్నారు.
సింహరాశి..
ఆకస్మిక ధననష్టం కలిగే అవకాశం ఉంది. మానసిక ఆందోళనతో ఉంటారు. కుటుంబంలో మార్పును కోరుకుంటారు. పనులు ముందుకు సాగవు. ఆర్థిక పరిస్థితి ఇబ్బంది కలిగిస్తుంది. దైవదర్శనాలు. ఆకస్మిక ప్రయాణాలు చేస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలు సామాన్యంగా ఉంటాయి.మీ పనితీరుతో అందరి మనసులను గెలుచుకుంటారు.
కన్యరాశి..
మంచి ఆలోచనలను కలిగి ఉంటారు. బంధు మిత్రులు గౌరవిస్తారు. దీర్ఘకాలిక సమస్యలు తీరతాయి. ఆప్తుల సలహాలు స్వీకరిస్తారు. సంఘంలో ఆదరణ లభిస్తుంది. వ్యవహారాలలో విజయం. వ్యాపారాలు, ఉద్యోగాలు అనుకూలిస్తాయి. తొందరపాటు నిర్ణయాలు వద్దు. అవగాహనతో ముందుకు సాగండి. ఊహించిన ఫలితాలను పొందుతారు.
తులరాశి..
వృత్తి, ఉద్యోగరంగాల్లో నష్టపోమే అవకాశం ఉంది . కుటుంబంలో మార్పులు కోరుకుంటారు. కొత్త రుణాలు చేస్తారు. విద్యార్థులకు నిరుత్సాహం. ఆలయాలు సందర్శిస్తారు. దువినోద కార్యక్రమాలలో పాల్గొంటారు.
వృశ్చికరాశి..
పనులలో పురోగతి. ఆశ్చర్యకరమైన సంఘటన. చేపట్టే పనులలో కొన్ని ఇబ్బందులు పెరగకుండా చూసుకోవాలి. క్రమంగా సమస్యలు తగ్గుముఖం పడతాయి. తొందరపడి నిర్ణయాలు తీసుకోకండి. ఆధ్యాత్మిక చింతన. దూరప్రాంతాల నుంచి కీలక సమాచారం. వ్యాపారాలు, ఉద్యోగాలు ఉత్సాహాన్నిస్తాయి.
ధనుస్సురాశి..
సన్నిహితుల నుంచి ధనలాభం. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాది రంగాలలో పరిస్థితులు తారుమారు కాకుండా ముందు జాగ్రత్త పడడం మంచిది. ఆహ్వానాలు అందుతాయి. వ్యవహారాలలో విజయం. నూతన ఒప్పందాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు సంతృప్తినిస్తాయి.
మకరరాశి..
గొప్ప ఆలోచన విధానంతో అభివృద్ధిని సాధిస్తారు. బుద్ధిబలం విశేషంగా పనిచేస్తుంది. సన్నిహితులతో విభేదాలు ఏర్పడతాయి. ఆకస్మిక ప్రయాణాలు చేస్తారు. ముఖ్యమైన వ్యవహారాలలో ఆటంకాలు ఎదురవుతాయి. అనారోగ్యం కలుగుతుంది. వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకోని మార్పులు.
కుంభరాశి..
గృహంలో మార్పులు కోరుకుంటారు. స్వల్ప అనారోగ్య కారణంతో నిరుత్సాహంగా ఉంటారు. స్త్రీలతో తగాదాలు ఏర్పడే అవకాశాలు ఉంటాయి. సోదరుల నుంచి ఒత్తిడులు ఏర్పడతాయి. ఆధ్యాత్మిక చింతన ఎక్కువవుతుంది. పనులు ముందుకు సాగవు. మానసిక అశాంతి. వ్యాపారాలు, ఉద్యోగాలలో చికాకులు ఏర్పడతాయి.
మీనరాశి..
బంధుమిత్రులతో కలిసి కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుని భవిష్యత్ ప్రణాళికలు వేస్తారు. పనులలో ఆటంకాలు తొలగి అనుకున్నది సాధిస్తారు. ఆప్తుల నుంచి శుభవార్తలు వింటారు. వాహనాలు కొంటారు. ఆస్తి లాభాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు లాభాలు చేకూరుతాయి.