తిరుమల శ్రీవెంకటేశ్వర స్వామి వారి సాలకట్ల బ్రహ్మోత్సవాలకు బుధవారం శాస్ర్తోక్తంగా అంకురార్పణ జరగనుంది. రేపు సాయంత్రం 6 గంటల నుంచి 7 గంటల మధ్య పుట్టమన్ను తెచ్చి, నవధాన్యాలు విత్తి వేడుకలకు అంకురార్పణ చేయనున్నారు. గురువారం ధ్వజారోహణంతో ముక్కోటి దేవతలకు ఆహ్వానం పలుకుతారు. అదేరోజు రాత్రి నుంచి వాహన సేవలు ప్రారంభమవుతాయి.
ఆంధ్రప్రదేశ్లోని 13 జిల్లాల నుంచి వెనుకబడిన వర్గాల భక్తుల కోసం టీటీడీ ఉచిత బస్సులను నడపాలని నిర్ణయించింది. ఈ నెల 7 నుంచి శ్రీవారి సాలకట్ల వార్షిక బ్రహ్మోత్సవాలు జరగనున్న నేపథ్యంలో టీటీడీ ఏర్పాట్లు చేసింది. వీరికి తిరుమల శ్రీవారి దర్శనంతో పాటు తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి దర్శనం చేయించనున్నారు. హిందూ ధర్మం ప్రచారం చేసేందుకు, మత మార్పిడులను అరికట్టేందుకు దేవాదాయశాఖతో కలిసి సమరసత సేవా ఫౌండేషన్ఆధ్వర్యంలో టీటీడీ నిర్వహిస్తోంది.
తొలివిడతగా 13 జిల్లాల్లో రూ.25 కోట్లతో 502 ఆలయాలను నిర్మించింది. ఈ ఆలయాల పరిధిలోని భక్తులకు బ్రహ్మోత్సవాల సమయంలో శ్రీవారి దర్శనం చేయించనున్నారు. ఒక్కో జిల్లాకు 10 బస్సులు ఏర్పాటుచేశారు. ఒక్కో జిల్లాకు 10 బస్సులు ఏర్పాటుచేశారు. తూర్పు గోదావరి, విశాఖ జిల్లాల్లో ఏజెన్సీ ప్రాంతాలు ఎక్కువగా ఉండటంతో 20 బస్సులు అందుబాటులో ఉంచారు. దూరప్రాంతాల నుంచి వచ్చే భక్తులకు స్థానిక దాతల సహకారంతో భోజనాలకు టీటీడీ ఏర్పాట్లు చేపట్టింది. దర్శన టికెట్లు ఉన్న భక్తులను మాత్రమే తిరుమలకు అనుమతిస్తామని టీటీడీ స్పష్టం చేసింది.


బీజేపీతో మళ్లీ పొత్తు కోసం చంద్రబాబు తహతహ: సోము వీర్రాజు