బుల్లితెరపై సందడి మొదలైంది. . దేశవ్యాప్తంగా ప్రేక్షకులని ఎంతగానో అలరించిన బిగ్ రియాలిటీ షో బిగ్ బాస్ కార్యక్రమం తెలుగులో నాలుగు సీజన్స్ పూర్తి చేసుకొని ఐదో సీజన్లోకి అడుగుపెడుతుంది. అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్న బిగ్ బాస్ 5 ఈ రోజు సాయంత్రం 6 గంటలకు నాగ్ గ్రాండ్ ఎంట్రీతో ఈ రియాలిటీ షో ఆరంభం కానుంది. ఇప్పటికే ఫస్ట్ ఎపిసోడ్ షూటింగ్ ముగించుకుని టెలికాస్ట్కు సిద్ధంగా ఉంది.
ఈ మేరకు తాజాగా స్టార్ మా సరికొత్త ప్రోమోను వదిలింది. ఇందులో నాగార్జున బిగ్ బాస్ హౌస్లోకి ఎంట్రీ ఇచ్చారు .ఐదింతలు ఎంటర్టైన్మెంట్, ఎనర్జీ ఉంటాయని తెలుపుతూ వదిలిన తాజా ప్రోమోలో నాగ్ అల్ట్రా స్టైలిష్ లుక్లో ఎంట్రీ ఇచ్చి ఈసారి కిక్ టన్నుల్లో ఉంటుందని క్లారిటీ ఇచ్చారు. గ్రీన్-పింక్ కలర్ కాంబినేషన్లో ఈ సారి బిగ్ బాస్ హౌస్ భిన్నంగా ఉంది. బ్రిటీష్ కట్టడాలను తలపించేలా సెట్ ఉంది.
కాగా..కొద్ది రోజులుగా హైదరాబాద్లోని మారియట్ హోటల్లో క్వారంటైన్లో ఉన్న కంటెస్టులు ‘బిగ్ బాస్’ హౌస్లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారు. అంతేగాక.. సాయంత్రం కంటెస్టెంట్ల డ్యాన్సులతో షో హోరెత్తనున్నట్లు తెలుస్తోంది. మరి కొద్దిగంటలలో ప్రసారం కానున్న సీజన్ 5 కోసం బుల్లితెర ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
బిగ్ బాస్ సీజన్ 5 ఫైనల్ లిస్ట్ ..
యాంకర్ రవి – టీవీ యాంకర్, షణ్ముఖ జస్వంత్ – యూట్యూబ్ స్టార్, యానీ మాస్టర్ – కొరియోగ్రాఫర్
నటరాజ్ మాస్టార్ – కొరియోగ్రాఫర్ , శ్వేతా వర్మ – సినిమా నటి ప్రియ – సీరియల్, సినీ నటి, లహరి – సీరియల్ నటి, మానస్ – సీరియల్ నటుడు, సరయు – యూట్యూబ్ స్టార్ (7 ఆర్ట్స్), కాజల్ – ఆర్జే , విశ్వ – సీరియల్ నటుడు, శ్రీరామ చంద్ర – గాయకుడు, సన్నీ – వీజే, ఉమా దేవి – సీరియల్ నటి, సిరి హన్మంత్ – సీరియల్ నటి, యూట్యూబ్ స్టార్, సాయి తేజ (ప్రియాంక) – జబర్దస్త్ కమెడియన్, లొబో – యాంకర్
The BIGG day is here! Get ready for 5-much entertainment…Ikkada kick tonnullo vastundi 👁️ #BiggBossTelugu5 starting today at 6 PM on #StarMaa pic.twitter.com/HasK9Xwn7F
— starmaa (@StarMaa) September 5, 2021
పవన్ కళ్యాణ్ పై చేసిన విమర్శలకు కోన వెంకట్ వివరణ