ప్రముఖ బాలీవుడ్ నటి శిల్పా శెట్టిని కష్టాలు చుట్టు ముట్టాయి. పోర్నోగ్రఫి కేసులో అరెస్ట్ అయిన తన భర్త రాజ్ కుంద్రా ఇంకా ఆ కేసు నుంచి బయటపడలేదు. ఈ కేసులో క్రైమ్ బ్రాంచ్ పోలీసులు పలు కీలక ఆధారాలను సేకరించారు. పలువురు హీరోయిన్లను సైతం విచారించారు.
తాజాగా శిల్పా శెట్టి, ఆమె తల్లి వెల్‌నెస్ బిజినెస్ చీటింగ్ కేసులో ఇరుక్కుంది. మొన్న భర్త, ఇప్పుడు తల్లి వరుస కేసులతో శిల్పాకి పెద్ద షాక్ తగిలింది. ఉత్తర్ ప్రదేశ్‌లో ఓ వెల్‌నెస్ బిజినెస్‌లో జరిగిన చీటింగ్ కేసులో శిల్పా శెట్టితో పాటు ఆమె తల్లి సునంద పేర్లను లక్నో పోలీసులు ఎఫ్ఐఆర్‌లో చేర్చినట్టు సమాచారం. ఈ బిజినెస్‌కి సంబంధించి శిల్పా శెట్టిని, ఆమె తల్లి సునందను లక్నో పోలీసులు ప్రశ్నించనున్నారు.
డబ్బులు తీసుకుని మోసానికి పాల్పడ్డారని లక్నోకు చెందిన జ్యోత్స్న చౌహన్, రోహిత్ వీర్ సింగ్ విభుతిఖండ్ పోలీసు స్టేషన్, హజ్రత్ గంజ్ అనే రెండు పోలీసు స్టేషన్‌లో ఇచ్చిన ఫిర్యాదు మేరకు చీటింగ్ ఈ కేసులు నమోదయ్యాయి.
రజినీకాంత్, కమల్ హాసన్ లపై కట్టప్ప వ్యాఖ్యలు