టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ అందరికీ సుపరిచితమే. ఎప్పటికప్పుడు కొత్త తరహా కథలతో ప్రేక్షకులను అరిస్తారు. అయితే తాజాగా అర్జున్ చేస్తున్న సినిమా పుష్ప. ఈ సినిమాను స్టార్ దర్శకుడు సుకుమార్ తెరకెక్కిస్తున్నారు. ఇందులో లక్కీ బ్యూటీ రష్మికా హీరోయిన్గా చేస్తున్నారు. ఈ సినిమాపై అభిమానుల్లో తారాస్థాయి అంచనాలు ఉన్నాయి. అయితే ఈ సినిమా నుండి ఇప్పటివరకు పోస్టర్లు తప్ప మారె అప్డేట్ రాలేదు. అయితే.. తాజాగా పుష్ప మూవీ టీజర్ రిలీజ్ అయింది. “ఇంట్రడ్యూసింగ్ పుష్ప రాజ్” అంటూ యూనిట్ ఈ వీడియో రిలీజ్ చేసింది. ఇందులో బన్నీ ఊర మాస్ లుక్లో కనిపిస్తున్నాడు. అల్లు అర్జున్ తగ్గేదే లే అనే డైలాగ్ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఈ టీజర్ తో పుష్ప మూవీ మరో రేంజ్ కు వెళ్లింది. కాగా.. ఈ మూవీ ఆగస్టు 13న థియేటర్లలో రిలీజ్ కానుంది.
previous post
next post