నాలోని నన్ను నేను చూడాలి
నా మాటలు నేను వినాలి
కడలి అలలు పిలుస్తున్నాయి
కనులు ఆశగా చూస్తున్నాయి
మేఘమై మురిసిపోవాలనుంది
చినుకులుగా మారి చిందులెయాలని ఉంది
పచ్చటి పుడమి పై పరుగెత్తాలని ఉంది
నిశ్శబ్దమై నింగిలోకి తోంగిచూడాలని ఉంది
రాయినైనా రాగాలు తీయాలని ఉంది
పూవునై పరిమళం పంచాలని ఉంది
ఏరునై పారూతూ దారిచేస్తూ పొవాలనుంది
హంసలా మారి స్వేచ్చగా తిరగాలనుంది
గాలినై గగన వీధుల్లో విహరించాలనుంది
మౌనమై మనసులోమాటలు వినాలనుంది
గాత్రమై గుండెలయను శ్రుతి చేయాలనుంది
అందమైన అక్షరమై పదాలతో పయనించాలనుంది
ఏపీ భవిష్యత్తు అర్థం కాని ప్రశ్నగా మిగిలిపోయింది: సోమిరెడ్డి