ప్రేమ సఫలమైతే మంచి కావ్యమౌతుంది
విఫలమైతే మధుర కావ్యమౌతుంది
ప్రపంచ సాహిత్యంలో ప్రేమకథలన్నీ
విషాదాంతాలే అంటారు..
అనంతమైన ప్రేమకు అంతంలేదు
విషాదం అంతకన్నా లేదు
స్పరించిన కొద్ది ప్రేమ మధురం
మధురాతి మధురం!!
……………
మదిలో మెదిలే తొలి ఉహకు రూపం నువ్వు
మౌనం పలికిన తొలిపలుకువు నువ్వు
తొలకరి మేఘం కురిసిన తొలిచినుకులను దోసిళ్లతో నింపినప్పుడు
అందులో కనిపించే ఇంద్ర ధనస్సు నువ్వు
నా తొలి స్పందన నువ్వు
నా తుది శ్వాస నువ్వు!!
							previous post
						
						
					
							next post
						
						
					


జగన్ మొదటి సంతకమే పెద్ద మాయ: నారా లోకేశ్