telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు వ్యాపార వార్తలు సాంకేతిక

ఆపిల్ తో .. పోటీపడుతున్న… ఎల్.జి. మొబైల్…

lg released triple camera phone

ఇటీవల ఆపిల్ ఐఫోన్ ట్రిపుల్ కెమెరాలతో ఉన్న విషయం లీక్ అవడంతో అదే తరహాలో ఇతర సంస్థలు తమ మొబైల్ లను విడుదల చేసి, ఆపిల్ తో పోటీకి సిద్ధం అవుతున్నాయి. తాజాగా, ట్రిపుల్ రియర్ కెమెరాలతో ఎల్‌జీ వీ40 థింక్యూ స్మార్ట్‌ఫోన్‌ ఇపుడు మార్కెట్లో అందుబాటులోకి వచ్చింది. నేటి(జనవరి 19) నుంచి ఈ స్మార్ట్‌ఫోన్‌ విక్రయానికి లభ్యం కానుంది. ఎల్‌జీ వీ40 థింక్యూ రియర్‌వైపు మూడు, రెండు సెల్ఫీ కెమెరాలు ఉండటం విశేషం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో పనిచేసే ఈ కెమెరాలు యూజర్లకు ఫోటోగ్రఫీలో కొత్త ఎక్స్‌పీరియన్స్‌ను అందించనున్నాయి. ఈ స్మార్ట్‌ఫోన్‌ గ్రే, బ్లూ కలర్స్‌లో లభ్యం కానుంది.

భారత మార్కెట్లో ధర రూ. 60వేలు. అయితే అమెజాన్‌ గ్రేట్‌ ఇండియన్‌ సేల్‌లో ప్రైమ్‌ సభ్యులకు మాత్రమే. రూ.49,900కే లభిస్తోంది. వీరికి జనవరి19వ తేదీ మధ్యాహ్నం నుంచి కొనుగోలు చేసే అవకాశం ఉన్న సంగతి తెలిసిందే.

ఎల్‌జీ వీ40 థింక్యూ ఫీచర్లు :

6.40 ఇంచెస్‌ డిస్‌ప్లే
స్నాప్‌డ్రాగన్‌ 845 సాక్‌
1440X3120 పిక్సెల్స్‌ రిజల్యూషన్‌
ఆండ్రాయిడ్‌ 9 పై
6జీబీ ర్యామ్‌, 128 జీబీ స్టోరేజ్‌
8+5 ఎంపీ ఫ్రంట్‌ కెమెరా
12+12+16 రియర్‌ కెమెరా
3300 ఎంఏహెచ్‌ బ్యాటరీ

Related posts