telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

మరో సినిమాకు రెడీ అవుతోన్న స్వీటీ…

Anushka

నాగార్జున, పూరీ జగన్నాథ్ కాంబోలో వచ్చిన సూపర్ సినిమాతో అనుష్క తెలుగునాట అడుగు పెట్టింది. ఆ తరువాత మహానంది అలా వరుసగా తనదైన నటనతో అగ్ర హీరోయిన్‌గా ఎదిగింది. అరుంధతి సినిమాతో వుమన్ ఓరింయాటెడ్ సినిమాలకు కేరాఫ్‌గా మారింది. అయితే ఈ ఏడాది కరోనా కారణంగా ఏ ఒక్క సినిమాలోనూ ఈ ముద్దుగుమ్మ కనిపించలేదు. అంతేకాకుండా బాహుబలి2 తరువాత అతి తక్కువ సినిమాలలో కనిపించింది. సినిమాలను ఎంచుకోవడంలో ప్రస్తుతం అనుష్క జాగ్రత్త వహిస్తుంది. బాహుబలి తరువాత విడుదల అయిన భాగమతి సినిమా ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేకపోయింది. దాని తరువాత నిశ్శబ్దం సినిమా థియేటర్లలో కాకుండా ఓటీటీలో విడుదలైంది. ఈ సినిమాకు అనుకున్నంత రెస్పాన్స్ రాలేదు. ఇక చివరిగి చిరంజీవి నటించిన సైరా నరసింహారెడ్డీ సినిమాలో చిన్న పాత్రలో కనిపించింది. అప్పటి నుంచి ఈ బొమ్మాళి ఏటువంటి నూతన సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు. తాజా సమాచారం ప్రకారం ఈ పుత్తడి బోమ్మ వచ్చే ఏడాది నుంచి మళ్లీ తెరపై కనిపించనుంది. అనుష్క ఈ ఏడాది చేసేందుకు రెండు సినిమాలకు సంతకం చేసింది. కానీ ఆ సినిమాలు వచ్చే ఏడాదికి వాయిదా పడ్డాయి. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న అనుష్క ఎట్టకేలకు తన కుటుంబంతో కొంత సమయం గడపగలిగానని, చాలా సంతోషంగా ఉన్నానంటూ తెలిపెంది. అంతేకాకుండా మొదలు కానున్న సినిమాల గురించి తెలిపింది. మరి ఈ సిమాలు ఏటువంటి కథనాలతో తెరకెక్కనున్నాయనే విషయాలు తెలియాల్సి ఉంది.

Related posts