telugu navyamedia
సినిమా వార్తలు

68 సంవత్సరాల “సొంతవూరు”

నటరత్న ఎన్.టి.రామారావు గారు నటించిన సాంఘిక చిత్రం జి.వి.యస్.ప్రొడక్షన్స్. వారి “సొంతవూరు”
23-05-1956 విడుదలయ్యింది

మధుర గాయకులు ఘంటసాల గారి సోదరులు ఘంటసాల సదాశివుడు గారు నిర్మాత గా జి.వి.యస్.ప్రొడక్షన్స్ బ్యానర్ పై దర్శకుడు ఇ.యస్.యన్.మూర్తి గారి దర్శకత్వంలో ఈ చిత్రాన్ని నిర్మించారు.

ఈ చిత్రానికి కథ,మాటలు: రావూరు వెంకట సత్యనారాయణరావు,పాటలు: రావూరు, సముద్రాల రాఘవాచార్య, మల్లాది రామకృష్ణశాస్త్రి, బి.గోపాలం, సంగీతం: ఘంటసాల వెంకటేశ్వరరావు, ఫోటోగ్రఫీ: ఏ. విన్సెంట్, కళ: తోట, ఎడిటింగ్: కంద స్వామి అందించారు.

ఈ చిత్రంలో ఎన్.టి. రామారావు, రాజసులోచన, షావుకారు జానకి, అమర్ నాధ్, రమణారెడ్డి, సూర్యకాంతం, రేలంగి, సి.ఎస్.ఆర్., సురభి కమలాబాయి, హేమలత, చదలవాడ, వంగర, మహంకాళి వెంకయ్య, తదితరులు నటించారు.

మధుర గాయకులు, ప్రఖ్యాత సంగీత దర్శకులు ఘంటసాల గారి సంగీత సారధ్యంలో
“శ్రీ గోపాలా రాధాలోలా నమ్మితిరా నిను నమ్మితిరా”
“మన వూరే భారత దేశం మనమంతా భారతీయులం”
“వెన్నెల విరియునురా దేవా, వేణువు నూదరా”
“స్వాగతంబోయి యీ స్వాతంత్ర సీమకు”
వంటి పాటలు, పద్యాలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.

ఘంటసాల వెంకటేశ్వరరావు గారు తన సోదరుడు ఘంటసాల సదాశివుడు నిర్మాత గా చిత్ర నిర్మాణం చేపట్టి ఈచిత్రంతో నిర్మాణరంగంలోకి అడుగు పెట్టి ఎన్టీఆర్ గారు కథానాయకుడుగా ఈసినిమా నిర్మించారు.

ఎన్.టి రామారావు గారు మొట్టమొదటిసారిగా శ్రీకృష్ణుని పాత్ర ను ఈ చిత్రం లోని ఒక అంతర్ నాటకంలో పోషించారు.

ఈ చిత్రం నిర్మాతలు ఆశించినంత విజయం సాధించ లేకపోయింది. ఈ సినిమా యావరేజ్ గా నడిచింది….

Related posts