నటరత్న ఎన్.టి. రామారావు గారు నటించిన సాంఘిక చిత్రం శ్రీ రాజరాజేశ్వరి ఫిలింస్ వారి “ఆప్తమిత్రులు” సినిమా 29-05-1963 విడుదలయ్యింది.
నిర్మాత,దర్శకుడు కె.బి. నాగభూషణం శ్రీ రాజరాజేశ్వరి ఫిలింస్ బ్యానర్ పై స్వీయ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని నిర్మించారు.
ఈచిత్రానికి మాటలు, పాటలు: సముద్రాల రామానుజాచార్య, సంగీతం: ఘంటసాల,సినిమాటోగ్రఫి: డి.ఎల్.నారాయణ( అన్నయ్య) నృత్యం: పసుమర్తి కృష్ణమూర్తి, కళ: ఎం.వెంకటేశ్వరరావు, ఎడిటింగ్: ఎన్.కె.గోపాల్ అందించారు.
ఈ చిత్రంలో ఎన్.టి.రామారావు, కాంతారావు, రాజసులోచన, కృష్ణ కుమారి, మిక్కిలినేని, రేలంగి, కన్నాంబ,గిరిజ, ఋష్యేంద్రమణి, లంక సత్యం, పెరుమాళ్ళుతదితరులు నటించారు.
ఘంటసాల గారి సంగీత దర్శకత్వంలో జాలువారిన పాటలు
“దయ రాదా నామీద మరియాదా”
“రామ నను బ్రోవరా,ప్రేమతో లోకాభి రామా”
“చిలిపి చిరునవ్వు,చిలికి ఉలికించు,”
వంటి పాటలు శ్రోతలను ఆకట్టుకున్నాయి
ప్రముఖ నటీమణి కన్నాంబ గారి భర్త కె.బి.నాగభూషణం గారు స్వీయ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని నిర్మించారు.
ఈ చిత్రంలో ఎన్టీఆర్ గారి చెల్లెలు గా హీరోయిన్ కృష్ణ కుమారి నటించారు. ఈ చిత్రం యావరేజ్ విజయాన్ని అందుకుంది.
విజయవాడ – శ్రీ రామ టాకీస్ తో పాటు మరికొన్ని కేంద్రాల్లో 50 రోజులు ఆడింది….
ఆఫీస్ బాయ్‌కి ఎక్కువ యాంకర్‌కి తక్కువ అన్నట్లు చూసారు : నటి అనిత చౌదరి