telugu navyamedia
సినిమా వార్తలు

“వినయ విధేయ రామ” మూడు రోజుల కలెక్షన్స్ 

vinaya vidheya rama movie juke box
బోయపాటి దర్శకత్వంలో రామ్ చరణ్ ప్రధాన పాత్రలో నటించిన “వినయ విధేయ రామ” సినిమా మొదటి వీకెండ్ పూర్తయ్యే వరకు ప్రపంచవ్యాప్తంగా రూ.40 కోట్ల డిస్ట్రిబ్యూటర్ షేర్ ని సాధించింది. తొలిరోజు భారీ ఓపెనింగ్స్ రాబట్టిన ఈ సినిమా రెండో రోజు వచ్చేసరికి కలెక్షన్లు డ్రాప్ అయ్యాయి. మూడవ రోజు కూడా ఆశించిన స్థాయిలో వసూళ్లు పెరగలేదు. ఓవర్సీస్ లో అయితే పరిస్థితి మరీ దారుణంగా ఉందట. అయితే నెగెటివ్ టాక్ వచ్చినప్పటికీ ఈ సినిమాకు ఇంతటి వసూళ్లు రావడం విశేషమనే అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు. 
మొత్తంగా మూడు రోజులకుగానూ రెండు తెలుగు రాష్ట్రాల్లో రూ.33.41 కోట్లు వసూలు చేసిన ఈ సినిమా రెస్ట్ ఆఫ్ ఇండియా మరో రూ.4.95 కోట్లు, ఓవర్సీస్ లో రూ.1.40 కోట్లు రాబట్టింది. ప్రపంచవ్యాప్తంగా మొత్తం 39.76 కోట్లను వసూలు చేసింది. 
ఏరియాల వారీగా మూడు రోజుల వసూళ్లు… 
నైజాం – రూ. 8.01 కోట్లు 
సీడెడ్ – రూ. 8.30 కోట్లు 
ఉత్తరాంధ్ర – రూ. 3.41 కోట్లు 
గుంటూరు – రూ. 4.85 కోట్లు
ఈస్ట్ – రూ. 2.51 కోట్లు
వెస్ట్ – రూ. 2.28 కోట్లు
కృష్ణ – రూ. 2.06 కోట్లు 
నెల్లూరు – రూ. 1.99 కోట్లు

Related posts