ట్రంప్ మద్దతుదారులు క్యాపిటల్ హౌస్ ను ముట్టడించారు. కాంగ్రెస్ సమావేశం జరిగే సమయంలో ఈ సంఘటన జరగడంతో ప్రపంచం యావత్తు నివ్వెరపోయింది. జో బైడెన్ ఎన్నికను అధ్యక్షుడు ట్రంప్ గుర్తించడం లేదు. అధికారం బదలాయించకుండా చివరి వరకు అడ్డుకునే ప్రయత్నాలు చేశారు. చివరిగా మద్దతుదారులతో ముట్టడికి ప్రయత్నించారు. తన మద్దతుదారులు సంయమనం పాటించాలని, యూఎస్ క్యాపిటల్ హౌస్ ను వదిలి వెళ్లాలని ట్వీట్ చేశారు. అయితే, రాజ్యాంగంలోని 25వ సవరణ ప్రకారం అధ్యక్షుడిని తొలగించేందుకు క్యాబినెట్ ప్రయత్నిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. రాజ్యాంగంలోని 25 వ సవరణను ఎందుకు తీసుకొచ్చారు. ఏం చెప్తున్నది? 1663లో అప్పటి అమెరికా అధ్యక్షుడు జాన్ ఎఫ్ కెన్నడీ మరణం తరువాత రాజ్యాంగంలో ఈ సవరణ తీసుకొచ్చారు. అధ్యక్షుడు సరిగా పనిచేయని సమయంలో అతనిని తొలగించేందుకు, స్వచ్చందంగా పదవి నుంచి తప్పుకోనప్పుడు ఈ సవరణ ద్వారా అధ్యక్షుడిని తొలగించవచ్చు. ఉపాధ్యక్షుడు కేబినెట్ తో కలిసి చర్చించి నిర్ణయం తీసుకుంటారు.

