telugu navyamedia
సినిమా వార్తలు

దూసుకుపోతున్న “మజిలీ” ట్రైలర్

Majili Trailer wins 2 Million Views

నాగ చైత‌న్య‌, స‌మంత‌, దివ్యాంక కౌశిక్ ప్ర‌ధాన పాత్ర‌ల‌లో శివ నిర్వాణ తెర‌కెక్కించిన చిత్రం “మజిలీ”. దేర్ ఈజ్ లవ్ దేర్ ఈజ్ పెయిన్ ఉపశీర్షిక. షైన్ స్క్రీన్ పతాకంపై సాహు గారపాటి, హరీష్‌ పెద్ది ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఏప్రిల్ 5న విడుద‌ల కానున్న ఈ చిత్రానికి సంబంధించి జోరుగా ప్ర‌మోష‌న్ కార్య‌క్ర‌మాలు చేప‌డుతున్నారు. ఆదివారం ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ రిలీజ్ కార్యక్రమం జరిగింది.

ఈ వేడుకకు నాగార్జున, వెంకటేష్ ముఖ్య అతిథులుగా విచ్చేశారు. ఈ సందర్భంగా చిత్రం ట్రైలర్ ను కూడా విడుదల చేశారు. ఈ ట్రైలర్ లో లవ్, యాక్షన్, ఎమోషన్ ప్రధానంగా సన్నివేశాలు సాగాయి. ఈ ట్రైలర్ కు విడుదలైన కొన్ని గంటల్లోనే 2 మిలియన్ డిజిటల్ వ్యూస్ తో సోషల్ మీడియాలో దూసుకుపోవడం విశేషం. దీంతో చిత్రబృందం సంతోషం వ్యక్తం చేస్తున్నారు. సినిమా హిట్ అవుతుందనే నమ్మకంతో ఉన్నారు. ఈ ట్రైలర్ ను మీరు కూడా వీక్షించండి.

ఇప్ప‌టికే టీజ‌ర్‌తో పాటు పాటలను చేయగా… వాటికి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తోంది.  గోపిసుందర్ సంగీతం అందించిన దివ్యాంశ కౌశిక్ ముఖ్యమైన పాత్రను పోషించారు. ఇక సమంత, నాగ చైతన్య పెళ్ళైన తరువాత మొదటిసారిగా జంటగా నటిస్తున్న ఈ సినిమాపై మంచి అంచనాలు వున్నాయి. ఇటు యూత్, అటు కుటుంబ సమేతంగా చూడదగ్గ విధంగా తెరకెక్కుతున్న ఈ సినిమా ఏ స్థాయిలో హిట్ ను అందుకుంటుందో చూడాలి.

Related posts