telugu navyamedia
సినిమా వార్తలు

ఏ చిత్రకారుడి కుంచెకు దొరికావో…

ye chitrakarudi kuncheku dorikavo poetry corner
అహా ఏ చిత్రకారుడి కుంచెకు 
దొరికావో కదా…
ఎంతటి నైపుణ్యమో ఆ కళాకారుడికి…
నింగిలోని తారకలన్నీ ఏకంచేసి
నిన్ను ద్రువతారగా మలిచాడుగా…
అణువణువునా నిను తాకుతూ
ఆణిముత్యంలా చేసాడుగా…
ఆ నింగిలోని బ్రహ్మ నీకు ఒక్క 
మచ్చైనాపెడతాడెమో…కాని?…
నిను మలిచిన ఈ బ్రహ్మ ఏమచ్చా 
లేకుండా చేసాడుగా…
చీకటిలో కూడ మిల మిల
మెరిసిపోతున్నావుగా…
చిన్నబోదా ఆ కలువ నీ ముందు…
ఆ జాబిలి అవసరమా..
ఈ జాబిలి ముందు…
-మాధవి గోపిశెట్టి,
హైదరాబాదు 

Related posts