telugu navyamedia
సామాజిక

ఉగాది పండ‌గ విశిష్ట‌త‌.. పురాణాలు ఏం చెబుతున్నాయి..

జ‌రుపుకునే అతి ముఖ్య‌మైన‌ పండుగ ఉగాది .. ఉగాది రోజు నుండే తెలుగు సంవత్సరం మొదలవుతుంది కాబట్టి ఇది తెలుగువారి మొదటి పండుగ. తెలుగు ప్రజలు ఎక్కువగా ఉపయోగించే చంద్రమాన పంచాంగం ప్రకారం మొదటి నెల చైత్రమాసం. చైత్రమాసం మొదటి రోజైన చైత్ర శుద్ధ పాడ్యమి నాడు ఉగాదిని జరుపుకుంటారు. ఈ పండుగా ఎన్నో ప్రాంతాల్లో ఎన్నో రకాలుగా ఎంతో ఘనంగా చేసుకుంటారు.

సంవత్సరానికి తొలి మాసం చైత్రమాసం… చైత్రమాసం అనగానే మనకి ఈనెలలో ఉగాది, శ్రీరామనవమి గుర్తుకొస్తాయి. చైత్ర శుధ్ద పాడ్యమి నుంచి నవమి వరకు తొమ్మిది రోజులపాటు వసంత నవరాత్రులు జరుపుతారు. పౌర్ణమి రోజున చంద్రుడు చిత్తా నక్షత్రంలో ఉన్న రోజు కాబట్టి దీనికి చైత్రము అనే పేరు వచ్చిందని కూడా చెపుతారు.

సూర్యుడు కూడా మొదటి రాశియైన మేష రాశిలో సంచరిస్తున్నాడు. చైత్ర మాసంలో జరుపుకునే వసంత నవరాత్రులకు రామాయణానికి ఏదో అవినాభావ సంబంధం ఉందనిపిస్తుంది. రామాయణంలోని ఎన్నో ముఖ్య ఘట్టాలు ఈ తొమ్మిది రోజులలో జరిగాయి. రాముడు జన్మించినది మొదలు, వనవాసానికి వెళ్ళటం, దశరథుని మరణం, సీతాపహరణం, రావణుని సంహారానంతరం సీతారాములు అయోధ్యానగరానికి చేరటం, శ్రీరామపట్టాభిషేకము వంటివి ఎన్నో ముఖ్యమైన సంఘటనలు ఈ చైత్రమాసంలో జరిగాయి.

Ugadi 2022 Importance – Telugu and Kannada New Year 2022 - Ugadi Panduga in  Andhra Pradesh – Telangana and Karnataka | Hindu Blog

ఉగాది నాడు దేవాలయాల్లో పంచాంగ శ్రవణాలు జరుగుతాయి. ఆసంవత్సరంలో జరగబోయే అనేక ముఖ్యమైన విషయాలను పండితులు ప్రజలకు వివరిస్తారు. జనవరి నెలతో ప్రారంభమయ్యే ఇంగ్లీషు వారి క్యాలెండర్ మాదిరిగానే తెలుగువారి పంచాంగం చైత్ర శుద్ద పాడ్యమితో మొదలవుతుంది.

ఉగాది పండుగ విశిష్టత..

చైత్ర మాసం శుక్లపక్షం పాడ్యమి రోజున ఆ విధాత బ్రహ్మ ఉగాది రోజే సృష్టి ఆరంభించాడంటారు. సోమకాసురుడు వేదాలను దొంగిలించిన కారణంగా శ్రీమహావిష్ణువు మత్స్యావతారంలో అతణ్ణి చంపి వాటిని తిరిగి బ్రహ్మదేవుడికి అప్పగించిన సందర్భంగా ‘ఉగాది’ ఆచరణలోకి వచ్చిందని  పురాణేతిహాసాల కథనాలు చెబుతున్నాయి

చైత్ర శుద్ధ పాడ్యమి  రోజున సూర్యోదయ వేళలో బ్రహ్మ దేవుడు సృష్టిని సృష్టించాడని అంటారు. అంటే కాలగణాన్ని గ్రహ, నక్షత్ర, రుతు, మాస వర్ష, వర్షాధికులను బ్రహ్మదేవుడు ఆ రోజు వర్తింపజేస్తాడని నమ్మకం. అంతేకాకుండా వసంత రుతువు కూడా ఈ రోజు నుంచే ప్రారంభమవుతుంది. అందుకే నూతన జీవితానికి నాందిగా ఉగాది పండుగను జరుపుకుంటారు.

Brahma: The Hindu Lord of Creation | The Hindu Gods

శకకర్త శాలివాహనుడు పట్టాభిషక్తుడైన ఈ రోజు ప్రాశస్త్యంలోకి వచ్చిందని మరో గాధ ఉంది. ‘ఉగాది’, ‘యుగాది’ అనే రెండు పదాలు వాడుకలో ఉన్నాయి. ‘ఉగ’ అంటే నక్షత్ర గమనం. నక్షత్ర గమనానికి ఆది ఉగాది అంటే సృష్టి ఆరంభమైనదినమే ఉగాది. యుగం అనగా ‘ద్వయం; లేదా ‘జంట’ అని అర్థం. ఉత్తారయణ, దక్షిణాయణ ద్వయ సంయుతం యుగం కాగా.. ఆ యుగానికి ఆది యుగాదిగా మారింది. ఉగాది శబ్దానికి ప్రతిరూపంగా ఉగాదిగా రూపొందింది.

 

Related posts