telugu navyamedia
crime news Telangana telugu cinema news

డ్రగ్స్‌కేసులో సినీ సెలబ్రిటీలకు క్లీన్ చిట్

1000 Crores Ddrugs seized Bomba

రెండేళ్ల క్రితం టాలీవుడ్ సినీ పరిశ్రమకు చెందిన కొందరికి డ్రగ్స్‌తో సంబంధాలు ఉన్నాయనే ఆరోపణలతో సిట్ చార్జీషీట్ దాఖలు చేసింది. అప్పట్లో ఈ కేసు హైదరాబాద్‌లో సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే.డ్రగ్స్‌కేసులో సినీ సెలబ్రిటీలు నిందితులు కాదని, బాధితులేనని సిట్‌ రిపోర్ట్‌లో పేర్కొంది. సినీనటులతో పాటు పాఠశాల విద్యార్థులు కూడా డ్రగ్స్‌ బారిన పడుతున్నారని ఎక్సైజ్‌ అధికారుల దర్యాప్తులో తేలడంతో నగరవాసులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. దీనిపై అప్పట్లో ఎక్సైజ్‌ శాఖ సిట్‌ అధికారులు లోతైన దర్యాప్తు చేపట్టారు. ఫోరం ఫర్‌ గుడ్‌ గవర్నెన్స్‌ వ్యవస్థాపకులు పద్మనాభరెడ్డి సమాచార హక్కు చట్టం ద్వారా ఈ కేసు వివరాలను సేకరించారు.

అయితే చార్జిషీట్లలో సినీ ప్రముఖులను బాధితులుగా పేర్కొవడంపై ఫోరం ఫర్‌ గుడ్‌ గవర్నెన్స్‌ అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. డ్రగ్స్‌ కేసును నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నారంటూ తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి కూడా ఫిర్యాదు చేసింది. ముంబై నుండి రఫెల్ అలెక్స్ అనే వ్యక్తి డ్రగ్స్‌ను తరలిస్తున్నట్టుగా చార్జీషీట్‌లో సిట్ పేర్కొంది.ఈ కేసులో కొందరు సినీ ప్రముఖుల నుండి సిట్ బృందం వెంట్రుకలు, చేతి వేళ్ల నమూనాలను కూడ తీసుకొన్నారు. అయితే టాలీవుడ్ నటుల పేర్లను చార్జిషీట్లలో సిట్ అధికారులు చేర్చలేదు. టాలీవుడ్ డ్రగ్స్ వ్యవహారంలో మొత్తం 12 కేసులను సిట్‌ నమోదు చేసింది. అయితే దాఖలైన చార్జిషీట్లలో సినీ సెలబ్రిటీలకు క్లీన్ చిట్ ఇచ్చింది.

Related posts

రెజీనాతో రొమాన్స్ బాగుంది: సోన‌మ్ క‌పూర్

ashok

తెలంగాణాలో .. కాంగ్రెస్ ఖాళీ.. ఉన్న ముగ్గురు తెరాస లోకి..

vimala p

తాగిన మత్తులో హీరోయిన్ రచ్చ… సోనమ్ కపూర్ కు అవమానం

vimala p