telugu navyamedia
Uncategorized

శానిటైజ్ చేసుకుని దుకాణాల్లో చోరీ!

sanitizer mask corona

కరోనా వ్యాపిస్తున్న నేపథ్యంలో చోరీలకు పాల్పడే దొంగలు ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. దొంగతనానికి వచ్చి చేతులను శానిటైజ్ చేసుకుని మరీ చోరీకి పాల్పడ్డారు. ఈ ఘటన రాజస్థాన్ లోని దౌల్ పూర్ పోలీసు స్టేషన్ పరిధిలో జరిగింది. వివరాల్లోకి వెళితే, ఇక్కడి రెండు దుకాణాల్లోకి వెనుకవైపు నుంచి చొరబడిన దొంగలు తొలుత అక్కడున్న ఆహార పదార్ధాలను భుజించారు. 

ఆ తరువాత చేతులు శానిటైజర్ తో పరిశుభ్రపరచుకున్నారు. తమకు కనిపించిన రూ. ఐదు వేలకు పైగా నగదు, లక్ష రూపాయల విలువైన వస్తువులను చోరీ చేశారు. రెండు కిరాణా దుకాణాల్లో ఇలాగే చేశారు. ఉదయం దుకాణం యజమానులు తలుపు తీసిన తరువాత చోరీ జరిగిందన్న విషయాన్ని గమనించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. అక్కడి సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించిన పోలీసులు, కేసు నమోదు చేసుకొని ధర్యాప్తు చేస్తున్నారు.

Related posts

సౌదీ రాజకుటుంబంలో 150 మందికి కరోనా!

vimala p

అవినీతి నుంచి సమాజాన్ని రక్షించుకోవాలి: పవన్ కల్యాణ్

vimala p

మాథుర్యం

ashok