telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

అల వైకుంఠపురంలో : “సామజవరగమన”… యూట్యూబ్‌లో 100 మిలియన్ వ్యూస్

AY

స్టైలిష్‌స్టార్ అల్లు అర్జున్ హీరోగా, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న సినిమా ‘అల వైకుంఠపురములో…’ వీరిద్దరి కాంబినేషన్‌లో రాబోతున్న హ్యాట్రిక్ సినిమా ఇది కావడంతో సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. పలు విజయవంతమైన చిత్రాల్ని అందించిన భారీ నిర్మాణ సంస్థలు ‘హారిక అండ్ హాసిని క్రియేషన్స్’, ‘గీతాఆర్ట్స్’ కాంబినేషన్‌లో ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదల అవుతోందని చిత్ర బృందం ఇప్పటికే ప్రకటించింది. ఇటీవలే విడుదల చేసిన ‘సామజవరగమన’, ‘రాములో రాముల’, ‘ఓ డాడీ’ పాటలు చిత్రంపై అంచనాల్ని తారాస్థాయికి చేర్చాయి. ఈ పాటలు ఎంతటి సంచలనం సృష్టించాయో తెలిసిందే. మొదటి పాట ‘సామజవరగమన’ కు ఇప్పటివరకు యూట్యూబ్‌లో 100 మిలియన్ వ్యూస్ రావడం విశేషం. సౌత్ ఇండియా సినిమా చరిత్రలో ఒక పాటకు 100 మిలియన్ వ్యూస్ రావడం ఇదే ప్రథమం. తమిళ గాయకుడు సిద్ శ్రీరామ్ ఆలపించిన ఈ పాటకు అల్లు అర్జున్ అభిమానులు, సినీ ప్రేమికులు బ్రహ్మరథం పట్టారు. లక్షల్లో టిక్ టాక్‌లు చేసి ఈ పాటను భారీ హిట్ చేశారు. సుప్రసిద్ధ గేయ రచయిత శ్రీ సిరివెన్నెల సీతారామశాస్త్రి రచించిన ఈ గీతానికి తమన్ అద్భుతమైన ట్యూన్ అందించారు.

Related posts