telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

సాహూ .. అంచనాలను అందుకోలేకపోతుందా.. కలెక్షన్ లో చాలా వెనుకే..

Saaho

ఎంతో గొప్పగా విడుదలైన సాహో కనీస కలెక్షన్స్ కూడా రాబట్టలేకపోయిందా.. బాహుబలి తర్వాత ప్రభాస్ నటించిన ఈ చిత్రాన్ని అందరూ ఆహా ఓహో అని అంచనాలను ఎప్పటికప్పుడు పెంచేస్తూనే ఉన్నారు. అందుకు తగ్గట్టుగానే 60-70 కోట్ల బడ్జెట్ తో అనుకున్న సినిమా కాస్త 350 కోట్లకు చేరింది. చివరికి చూస్తే సినిమా మాత్రం బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టేసింది. అయితే ట్రైలర్ మరియు టీజర్ ఇచ్చిన హైప్ తో వసూళ్లు బాగానే వస్తాయని ఆశించిన ప్రొడ్యూసర్లకు కూడా భారీ షాక్ తగిలింది. అమెరికా లో రిలీజ్ అయిన ఈ చిత్రం క్లాసిక్ స్క్రీన్ ప్లే మరియు హై వోల్టేజ్ యాక్షన్ సీన్లతో భారీ మొత్తాన్ని రాబోతుందని నిర్మాతలు అంచనా వేశారు. అయితే ఈ చిత్రం ప్రతి ఒక్కరిని ఆశ్చర్యపరుస్తూ కనీసమైన ఒక బిలియన్ డాలర్ల మార్గం కూడా లేకపోయింది.

నాలుగు భాషల్లో రిలీజ్ అయినా సాహో కేవలం 915 కోట్ల డాలర్లు మాత్రమే యూఎస్ ప్రీమియర్ ద్వారా సంపాదించింది. మొత్తం మీద తెలుగు చిత్రాలన్నిటిలో యూఎస్ ప్రీమియర్ షోల ద్వారా సాధించిన మొత్తం లో ఆరవ స్థానంలో నిలిచింది. పవన్ కళ్యాణ్ ‘అజ్ఞాతవాసి’ ఏకంగా 1.5 మిలియన్ డాలర్ల సంపాదించి ఆశ్చర్యపరిచగా సాహో కనీసం ఒక మిలియన్ డాలర్లు కూడా దాటలేకపోయిన వైనం చెబుతోది సినిమా ఎంత చెత్తగా ఉంది అనేది. ఆఖరికి అట్టర్ డిజాస్టర్ అయిన మహేష్ బాబు ‘స్పైడర్’ కూడా ఒక మిలియన్ మార్కును ఈజీగా దాటేస్తే సాహో మాత్రం నాన తంటాలు పడి 900 వేల మిలియన్ డాలర్ల దగ్గరే ఆగిపోయింది. దీనికి ఒక ప్రధానమైన కారణం ఓవర్సీస్ డిస్ట్రిబ్యూటర్ ప్లానింగ్ అనే చెప్పాలి. అది కాకుండా యుఎస్ఎలో మార్కెట్ తెలుగు చిత్రాల మార్కెట్ రానురాను ఘోరంగా పడిపోతోంది. అందుకు సాహో నే నిదర్శనం.

* బాహుబలి 2 – $2.4 మిలియన్స్
* అజ్ఞాతవాసి – $1.52 మిలియన్స్
* బాహుబలి 1 – $1.39 మిలియన్స్
* ఖైదీ నెం 150 – $1.29 మిలియన్స్
* స్పైడర్ – $1 మిలియన్
* సాహో – $915 వేలు

Related posts