telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

సైరా ట్రైలర్ విడుదలకు .. రామ్ చరణ్ భారీ ఏర్పాట్లు…

Syeraa

ఇప్పటికే మెగా అభిమానులు సైరా సినిమా కోసం ఎంతగానో ఆశగా ఎదురు చూస్తున్నారు. రామ్చరణ్ నటించిన రంగస్థలం తర్వాత మరొక సినిమా పెద్దది రాకపోవడంతో మరో పక్క పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో ఉండటంతో బాక్స్ ఆఫీస్ దగ్గర వేరే హీరోల సినిమాలు హడావిడి చేస్తున్న నేపథ్యంలో చిరంజీవి నటించిన సైరా సినిమా పై భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఈ సినిమాతో ఎలాగైనా ఇండస్ట్రీలో భారీ ఎత్తున చరిత్రను సృష్టించే విధంగా అన్ని రికార్డులను తిరగరాసే విధంగా రామ్ చరణ్ ముందు నుండి ఔట్ పుట్ విషయంలో ఏ మాత్రం రాజీపడకుండా డైరెక్టర్ సురేందర్ రెడ్డి కి ఫుల్ ఫ్రీడమ్ ఇచ్చి సినిమాని కంప్లీట్ చేయమని చెప్పటంతో ఇప్పటికే ఈ సినిమా కొన్ని సీన్లు చూసిన రామ్ చరణ్ ఫుల్ శాటిస్ఫ్యాక్షన్ కావడంతో భారీ ఎత్తున ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ చేయడానికి ప్లాన్ వేసినట్లు ఫిలింనగర్ లో వార్తలు వినపడుతున్నాయి. ఫిల్మ్ నగర్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు..ఖతార్ లోని దోహా వేదికగా వచ్చే నెల 15 మరియు 16 తేదీలలో జరగనున్న సౌత్ ఇండియా ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్ (సైమా)వేదికపై ఈ చిత్ర ట్రైలర్ ని విడుదల చేయనున్నారని సమాచారం.

హిందీతో పాటు సౌత్ లోని పలు భాషలలో విడుదల కానున్న సైరా మూవీ ట్రైలర్ ని ఇలాంటి అంతర్జాతీయ వేదిక ద్వారా ప్రమోట్ చేయడం సినిమాకు అనుకూలించే అంశమే అని చెప్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన హిందీ వర్షన్ హక్కులు ఓ ప్రముఖ నిర్మాణ సంస్థ భారీ ధరకు కొనుగోలు చేసినట్లు కూడా టాక్. స్వాతంత్ర పోరాట నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాలో చిరంజీవి ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పాత్రలో నటించడంతో ఈ సినిమాపై టాలీవుడ్ ఇండస్ట్రీలో ఆసక్తి నెలకొంది. అంతేకాకుండా అమితాబచ్చన్ జగపతిబాబు, నయనతార, తమన్నా విజయ్ సేతుపతి లాంటి భారీ తారాగణం ఉండటంతో…సైరా సినిమా పై దేశ వ్యాప్తంగా మంచి క్రేజ్ ఏర్పడింది. దీంతో ప్రమోషన్ కార్యక్రమాలు కూడా అదే స్థాయిలో ఉండే విధంగా ప్రొడ్యూసర్ రామ్ చరణ్ అదిరిపోయే రీతిలో ప్లాన్ చేస్తున్నట్లు ఫిల్మ్ నగర్ లో వార్తలు వినబడుతున్నాయి. అక్టోబర్ 2వ తారీఖున గాంధీ జయంతి నాడు సినిమాని దేశ వ్యాప్తంగా విడుదల చేయటానికి రామ్ చరణ్ సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం.

Related posts