telugu navyamedia
telugu cinema news trending

అభిమానులు, శ్రేయాభిలాషులు అందరికీ హృద‌య‌పూర్వ‌క ధ‌న్య‌వాదాలు : రజినీకాంత్

rajinikanth on loksabha election support

సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ డిసెంబ‌ర్ 12న 69వ వ‌సంతంలోకి అడుగు పెట్టారు. ఆయ‌న పుట్టినరోజు సంద‌ర్భంగా అభిమానులు భారీ ఎత్తున సేవా కార్య‌క్ర‌మాలు చేప‌ట్టారు. సినీ సెల‌బ్రిటీలు, రాజ‌కీయ నాయ‌కులు, క్రీడా ప్ర‌ముఖులు త‌మ ట్విట్ట‌ర్ ద్వారా త‌లైవాకి ప్ర‌త్యేక జ‌న్మ‌దిన శుభాకాంక్ష‌లు అందించారు. స‌చిన్, అమీర్ ఖాన్, మ‌హేష్ బాబు, సురేంద‌ర్ రెడ్డి , మోహ‌న్ లాల్ ఇలా ప‌లువురు ప్ర‌ముఖులు విషెస్ తెలిపారు. అయితే త‌న‌కి బ‌ర్త్‌డే శుభాకాంక్ష‌లు అందించిన అభిమానులు, శ్రేయాభిలాషులు, స్నేహితులు ప్ర‌తి ఒక్క‌రికి హృద‌య‌పూర్వ‌క ధ‌న్య‌వాదాలు అని ర‌జ‌నీకాంత్ త‌న ట్వీట్‌లో పేర్కొన్నారు. ర‌జనీకాంత్ 168వ చిత్రం ప్ర‌స్తుతం సెట్స్ పై ఉండ‌గా,ఆయ‌న న‌టించిన తాజా చిత్రం ద‌ర్భార్ సంక్రాంతికి ప్రేక్ష‌కుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే.

Related posts

కేఏ పాల్ ఫిర్యాదు.. నేడు విచారణకు ఆర్జీవీ?

vimala p

“నాలోని లోపాల‌ని ప్రేమించే ఏకైక వ్య‌క్తి…” ప్రేమ వ్యవహారం బయటపెట్టిసిన పాయల్

vimala p

వైసీపీ మహిళా విభాగానికి .. కొత్త సారధిగా .. శ్రావణి .. !

vimala p