telugu navyamedia
ట్రెండింగ్ వ్యాపార వార్తలు

వరుస నష్టాలలో.. స్టాక్ మార్కెట్లు..

husge loses again in stock markets

గత ఆరు రోజుల నుండి స్టాక్ మార్కెట్లు నష్టాలనే చవిచూస్తున్నాయి. దేశీయంగా, అంతర్జాతీయంగా నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో ఈ నష్టాలు కొనసాగుతున్నాయని నిపుణులు పేర్కొంటున్నారు. నష్టపోయిన వారిలో ముఖ్యంగా ఐటీ, ఆయిల్ అండ్ గ్యాస్, టెలికాం స్టాకులు ఉన్నాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 157 పాయింట్లు కోల్పోయి 35,876కు పడిపోయింది. నిఫ్టీ 47 పాయింట్లు పతనమై 10,746 వద్ద స్థిరపడింది. ఈ ఉదయం మిక్స్ డ్ గా మార్కెట్లు ప్రారంభమైనప్పటికీ… ఆ తర్వాత అమ్మకాల ఒత్తిడికి గురయ్యాయి.

బీఎస్ఈ సెన్సెక్స్ లో భారతి ఎయిర్ టెల్, ఇన్ఫోసిస్, ఏషియన్ పెయింట్స్, రిలయన్స్ ఇండస్ట్రీస్, కోల్ ఇండియాలు టాప్ లూజర్స్ గా ఉన్నాయి. యస్ బ్యాంక్, టాటా మోటార్స్, సన్ ఫార్మా, ఇండస్ ఇండ్ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్ తదితర కంపెనీలు లాభాలను నమోదు చేసుకున్నాయి.

Related posts