telugu navyamedia
సినిమా వార్తలు

ఈ “గ్యాంగ్ లీడర్” పిల్ల మోస్ట్ వాంటెడ్ హీరోయిన్…!

Priyanka-Arul-Mohan

సాధారణంగా కొత్తగా అడుగుపెట్టిన ఏ హీరోయిన్ కైనా తొలి చిత్రం సక్సెస్‌ని బట్టి అవకాశాలు వస్తుంటాయి. తొలి చిత్రంలో అమ్మడి అందచందాలు, పెర్ఫార్మెన్స్ బేరీజు వేసుకుని తదుపరి ఆఫర్స్ ఇస్తుంటారు. అయితే కొత్త అమ్మాయి ప్రియాంకా ఆరుళ్ మోహన్‌కు వాటన్నిటికీ అతీతంగా డెబ్యూ మూవీ విడుదల కాకుండానే అవకాశాలు పలకరిస్తున్నాయి. ప్రస్తుతం ఈ బ్యూటీ మీద పలువురు టాలీవుడ్ హీరోల కన్ను పడిందట.

నేచురల్ స్టార్ నానీ హీరోగా విక్రమ్ కే కుమార్ దర్శకత్వంలో ప్రస్తుతం సెట్స్ మీదున్న చిత్రం ‘గ్యాంగ్ లీడర్’. ఈ సినిమాలో నానీ సరసన ప్రియాంకా అరుళ్ మోహన్ అనే చెన్నైబ్యూటీ కథానాయికగా ఎంపికైంది. అయితే డైరెక్టర్ విక్రమ్ ప్రియాంకను మీడియాకు దూరంగా ఉంచాడు. అసలు ప్రియాంక ఈ సినిమాలో నటిస్తుందని కూడా చెప్పలేదు. అయినా విజయ్ దేవరకొండ, శర్వానంద్ లాంటి కుర్ర హీరోల కన్ను అమ్మడిపై పడిందట. ఎంక్వైరీలు కూడా మొదలు అయ్యాయట. ఇదిలా ఉంటే ప్రియాంక ‘గ్యాంగ్ లీడర్’ రిలీజ్ అయ్యేవరకూ వేరే సినిమాలో నటించకూడదని విక్రమ్ కండిషన్ పెట్టాడట. దీంతో యంగ్ హీరోలు ప్రియాంకా ‘గ్యాంగ్ లీడర్’ విడుదయ్యే వరకూ వెయిట్ చేయాల్సిందే. అయితే తాజా సమాచారం ప్రకారం విజయ్ దేవరకొండ ‘గ్యాంగ్ లీడర్’ అలా విడుదల కాగానే ప్రియాంకను ఇలా ఎగరేసుకు పోయే ప్రయత్నంలో ఉన్నాడట. ఈ వార్తల్లో ఎంత నిజముందో తెలియదు కానీ ప్రియాంక తదుపరి హీరో ఎవరవుతారో చూడాల్సిందే.

Related posts