telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

6వ అమెరికా తెలుగు సంబరాలు .. డాలస్ వేదికగా…

NATS Newyear celebrationsf
ఉత్తర అమెరికా తెలుగు సంఘం (నాట్స్) మే 24 నుండి 26 వరకు డాలస్ లోని ఇర్వింగ్ కన్వెన్షన్ సెంటర్ లో నిర్వహించనున్న 6వ అమెరికా తెలుగు సంబరాలకు డాలస్ వేదిక కానుంది. “మనమంతా తెలుగు -మనసంతా వెలుగు” ఇతివృత్తం ఆధారంగా మూడురోజుల పాటు కన్నులపండువుగా జరపనున్న సంబరాలకు ఏర్పాట్లు ముమ్మరంగా సాగనున్నాయి. వైవిధ్యభరితమైన సాంస్కృతిక కార్యక్రమాలు,కీరవాణి, మనో, ఆర్పీ పట్నాయక్ వంటి అగ్రగణ్యుల గాన కచ్చేరీలు, అందరినీ ఉత్తేజపరిచే నాట్యప్రదర్సనలు,అందరి నోళ్ళూరించే రుచికరమైన తెలుగు వంటకాలు,  ఉత్తమసాహిత్యవేత్తలతో సాహితీ మకరందాలను పంచే కార్యక్రమాలకు వేదికలు సిద్ధమౌతున్నాయి. అధిక వివరాలకు www.sambaralu.org ను దర్శించండి.
 
దాదాపు మూడువందలకు పైగా స్వచ్చంద సేవకులు సంబరాలకు సంబంధించిన వివిధ విభాగాలలో చేస్తున్న నిరంతర కృషి అభినందనీయం అని, కార్యక్రమాలకు వస్తున్న స్పందన, ఆదరణ అపూర్వం అని నాట్స్ డాలస్ సంబరాల అధిపతి శ్రీ కిషోర్ కంచెర్ల, నాట్స్ అధ్యక్షుడు శ్రీ శ్రీనివాస్ మంచికలపూడి మరియు నాట్స్ అధిపతి శ్రీ శ్రీనివాస్ గుత్తికొండ తమ సంతోషాన్ని వ్యక్తం చేసారు.
తెలుగు సంస్కృతి ప్రరిరక్షణకు మన సంస్థ  పుట్టినిల్లు: చిత్రలేఖనం పోటీలతో యువతకు ప్రోత్శాహం ప్రపంచ కవోష్ణతకు బారతీయ మూలాలు (Global Warming with element of India) అనే అంశంపై సంబరాల సాంస్కృతిక విభాగం వారి ఆధ్వర్యంలో మార్చి ౩౦వ తేదీ లూయిస్విల్లోని ‘అవర్ కిడ్స్ మాంటిస్సొరి’ ప్రాంగణంలో మధ్యాహ్నం 1:00 గం.కు   నిర్వహించనున్న చిత్రలేఖనం పోటీలకు విశేష స్పందన వస్తుంది. వయో పరిమితి చిన్నారులు-యువతను  మూడు విభాగాలుగా (వయసు 4-8, 9-13, 14-18 వరకు) విభజించి  ఈ పోటీలు నిర్వహించనున్నారు. ఈ పోటీల్లో ఎంతో మంది విద్యార్ధులు పాల్గొని అత్యంత ఆసక్తికరమైన అంశంపై తమ ఆలోచనలను రంగుల్లో చిత్రించడానికి సిద్ధంగా ఉన్నారు. అధిక వివరాలకు ఈ  లంకె ను దర్శించండి.
క్రీడాస్పూర్తితో టేబుల్ టెన్నిస్ పోటీలు: తెలుగు వారిమధ్య సఖ్యత, ఆరోగ్యం ప్రధాన ఉద్దేశ్యం ఆదివారం, మార్చి 31వ తేదీ ఉదయం 8:00 గం. నుండి ‘డాలస్ టేబుల్ టెన్నిస్’ ప్రాంగణంలో నిర్వహించడానికి ఉత్తర అమెరికా తెలుగు సమితి వారి క్రీడా విభాగం వారు అన్నీ ఏర్పాట్లు పూర్తీ చేసారు. ఇప్పటివరకు దాదాపు డెబ్బై మంది ఈ పోటీలో పాల్గొనేందుకు నమోదు చేసుకున్నారు.  గతంలో నిర్వహించిన వాలీబాల్ ఆటలపోటీలో చివరి నిమిషం వరకు ఉత్కంఠభరితంగా సాగిన జట్టులను క్రీడావిభాగం అభినందించింది.
అంబరాన్ని తాకే ఆరవ నాట్స్ సంబరాలకు మన తెలుగు వారందరికీ ఇదే మా ఆత్మీయ ఆహ్వానం!

Related posts