telugu navyamedia
సినిమా వార్తలు

ఫిలింనగర్ లో గ్యాంగ్ లీడర్ టైటిల్ మీద రచ్చ న్యాయం కోసం మాణిక్యం మూవీస్

nani

గ్యాంగ్ లీడర్ టైటిల్ మేము మాణిక్యం మూవీస్ పై రిజిస్ట్రేషన్ చేయించుకుని షూటింగ్ కూడా స్టార్ట్ చేసాము… నాని birthday నాడు ఈ టైటిల్ పై వారు షూటింగ్ స్టార్ట్ చేశారు అని తెలుసుకుని మేము రెండు ఫిల్మ్ ఛాంబర్ లో కంప్లైంట్ చేసాము… ఛాంబర్ వారు మాకు క్లారిటీ గా “గ్యాంగ్ లీడర్ ” , “నాని గ్యాంగ్ లీడర్” అను పేరుతో టైటిల్స్ వేరే ఎవరికి ఇవ్వలేదు అని మాకు చెప్పారు.. మేము ఆ వారం లో ఫిల్మ్ ఛాంబర్ లో ప్రెస్ మీట్ పెట్టి ఆ విషయాన్ని ప్రెస్ సమక్షం లో అందరికి చెప్పడం జరిగింది.

ఉగాది రోజున ఉదయం 7.55 కి మేము ఫిల్మ్ ఛాంబర్ లో మూహర్తం షాట్ చేసాము.. పెద్దలు సాగర్ గారు, కిషోర్ రాఠీ గారు,రవికుమార్ చావలి గారి సమక్షం లో ఈ కార్యక్రమం జరిగింది. తొందరలో షూట్ ముగించుకుని ఆగస్ట్ లో రిలీజ్ కి ప్లాన్ చేస్తున్నాము.కానీ మళ్ళీ నిన్న నాని గారు ఈ టైటిల్ గురించి కొన్ని మీడియా సంస్థల ముందు పై pic లో విధంగా టైటిల్ పై స్పందించారు.

మేము చాలా చిన్న ఫిల్మ్ మేకర్స్ మాకు టైటిల్ దగ్గరనుండి అన్ని చూసుకుని ముందుకు వెళ్ళితే మాకు బిసినెస్ పరంగా బాగుంటుంది. చిన్న సినిమాకి టైటిల్ కూడా పబ్లిసిటీ పరంగా చాలా హెల్ప్ అవుతుంది. మా దగ్గర టైటిల్ రిజిస్ట్రేషన్ కు సంబంధించి అన్ని సర్టిఫికెట్స్ ఉన్నాయి. ఆ సీర్టిఫికెట్లు కూడా మేము మీడియా ముందు చూపించాము. ఈ టైటిల్ నచ్చి మా సినిమాకి పార్టనర్స్ గా కొత్త ఇన్వెస్టర్లు వచ్చారు…ఇలాంటి వార్తలవలన మాకు నష్టం జరిగేలా ఉంది.
ఈ రోజు ఈ సమస్య మాది… రేపు మీలో కూడా ఎవరికైనా ఎదురవ్వొచ్చు… దయచేసి మాకు సపోర్ట్ గా నిలిచి న్యాయం కోసం మాకు సహాయపడగలరు.

ఇట్లు
మాణిక్యం మూవీస్
సింగులూరి మోహనరావు (M.A, BED)

Related posts