telugu navyamedia
సినిమా వార్తలు

స్టేజీపై హీరోతో హీరోయిన్ వెటకారం… కార్తీ కౌంటర్…

Karthi-and-Kasthuri

గత కొన్ని నెలల క్రితం శివకుమార్ ఓ కార్యక్రమానికి వెళుతుండగా… సెల్ఫీ కోసం ఆయనను అభిమానులు చుట్టేశారు. దీంతో శివకుమార్ కు చిర్రెత్తుకొచ్చి ఓ యువకుడి ఫోన్ పగలగొట్టిన విషయం అప్పట్లో చర్చనీయాంశంగా మారింది. ఆ తరువాత శివకుమార్ అలా ఎందుకు చేయాల్సివచ్చిందో వివరణ ఇవ్వడమే కాకుండా ఆ యువకుడికి కొత్త ఫోన్ కూడా కొనిచ్చారు.

తాజాగా సోమవారం చెన్నైలో “జులై కాట్రిల్” అనే తమిళ సినిమా ఆడియో విడుదల వేడుక జరిగింది. ఈ వేడుకకు కస్తూరి వ్యాఖ్యాతగా వ్యవహరించారు. ఈ వేడుకకు నటుడు కార్తీ ముఖ్య అతిథిగా వచ్చారు. ఈ సందర్భంగా కార్తితో “మీ నాన్న లేరు కదా.. రండి ఓ సెల్ఫీ దిగుదాం” అంది కస్తూరి. దీంతో కోపగించుకున్న కార్తీ ఆమెతో సెల్ఫీ దిగకపోగా నేరుగా స్టేజ్ పై ఉన్న మైక్ స్టాండ్ దగ్గరకు వెళ్లి ” అనుమతి లేకుండా ఓ సెలెబ్రిటీతో సెల్ఫీలు దిగడం ఎంత అమర్యాదకరంగా ఉంటుందో కొంతమందికి తెలియదు. ఫోన్ నుంచి వెలువడే ఫ్లాష్ లైట్ వల్ల మైగ్రేన్ ఉన్నవారికి చాలా ఇబ్బంది కలుగుతుంది” అని చెప్పేసి అక్కడినుంచి వెళ్లిపోయారు కార్తీ. దీంతో ఒక్కసారిగా షాక్ కావడం అక్కడున్న వారి వంతయ్యింది.

Related posts